20 మంది ఎమ్మెల్యేలా? నిజమేనా పవన్

20 మంది ఎమ్మెల్యేలా? నిజమేనా పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దారీతెన్నూలేకుండా రాష్ట్రంలో తిరిగేస్తున్నారు. అయినా... ఆయన పార్టీలో చేరడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. వివిధ పార్టీల్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన సామాజికి వర్గానికి చెందిన నేతలు కానీ ఎవరూ పవన్‌ వైపు చూడడం లేదు. రాజకీయంగా నిరుద్యోగంతో ఉన్న ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ ఆయన పార్టీలో చేరడం లేదు.

కానీ.. ఆ పార్టీలో ఉన్న చోటామోటా నేతలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని జోకులేస్తున్నారు. జనసేన నేతల ప్రకటనపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి.

 పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడానికి ఏపీకి చెందిన 20 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కన్వీనర్ వి.పార్థసారథి తెలిపారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే పవన్‌తో చర్చించారని, ఆయన నిర్ణయం తీసుకుని, తేదీ ఖరారు చేసిన తర్వాత వారంతా వచ్చి పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాత, కొత్త తరం మేలు కలయికతో పార్టీ ముందుకెళ్తుందన్న ఆయన.. పార్టీలో నవతరానికి 60 శాతం సీట్లు ఇస్తామని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో, ఒక్కో నియోజకవర్గాని ఒక్కోటి చొప్పున మేనిఫెస్టోలు తయారుచేస్తామని పార్థసారథి వివరించారు. అయితే... 60 శాతం కొత్తవాళ్లు, యువతకు ఇస్తామనడంపైనా విమర్శలొస్తున్నాయి. పార్టీలో ఎవరూ చేరకపోవడంతో అభిమానుల నుంచి ఎవరు అడిగితే వారికి టిక్కెట్ ఇచ్చేస్తారని... 60 శాతమేంటి 99 శాతం టిక్కెట్లు అలాగే ఇస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు