బీజేపీ ప‌రువు తీసేసిన వాజ్‌పేయి కోడ‌లు

బీజేపీ ప‌రువు తీసేసిన వాజ్‌పేయి కోడ‌లు

మాజీ ప్రధాని వాజపేయి మ‌ర‌ణం ప‌రిణామల‌పై బీజేపీ ఇర‌కాటంలో ప‌డిపోయింది. ఆయ‌న  చితాభస్మంతో కూడిన కలశాలను అన్ని రాష్ర్టాల్లో నిమజ్జనం చేసేందుకు సిద్ధ‌మైన బీజేపీ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీచే అన్ని రాష్ర్టాల బీజీపీ చీఫ్‌లకు ఈ కలశాలను అందజేయించింది. దేశంలోని వందకుపైగా నదుల్లో వాజపేయి చితాభస్మాన్ని నిమజ్జనం చేసేందుకు అస్థి కలశ యాత్రను ప్రధాని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో వాజపేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు బీజేపీ నాయకులు, వివిధ రాష్ర్టాల బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నెల 19న వాజపేయి దత్తపుత్రిక నమిత చేతులమీదుగా హరిద్వార్‌లోని హరీ-కా-పౌరీలో చితాభస్మం నిమజ్జనం మొదలైంది.

అయితే, ఈ ప‌రిణామంపై వాజ్‌పేయి కుటుంబ స‌భ్యులు భ‌గ్గుమ‌న్నారు. మాజీ ప్రధాని వాజపేయి మరణాన్నీ బీజేపీ రాజకీయంగా వాడుకుంటున్నదని ఆయన మేనకోడలు కరుణ శుక్లా ఆరోపించారు. ఆయన మృతితో ప్రజల్లో నెలకొన్న సానుభూతితో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలువడానికి బీజేపీ ప్రయత్నిస్తోంద‌ని గురువారం ఆమె ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మండిప‌డ్డారు. ``బీజేపీది స్వార్థ రాజకీయం. వాజపేయి బతి కున్నప్పుడు ఆయన పేరుతో లబ్ధిపొందింది. మరణించినా వదలడం లేదు`` అని తీవ్రస్థాయిలో విమర్శించారు. వాజపేయి చితాభస్మ కళశాలతో బీజేపీ నేతలు ర్యాలీలు నిర్వహించడాన్ని ఆమె త‌ప్పుప‌ట్టారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు