ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన కేటీఆర్.. త‌ర్వాతే గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ?

ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన కేటీఆర్.. త‌ర్వాతే గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ?

తెలంగాణ‌లో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. మొన్న‌టి వ‌ర‌కూ అంచ‌నాలుగా ఉన్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక‌ట్రెండు అడుగులు వేగంగా ముందుకు ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేకున్నా.. ముంద‌స్తును సూచించే ప‌రిణామాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకున్న‌ట్లుగా ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏడు గంట‌ల మంత్రివ‌ర్గ స‌మావేశం త‌ర్వాత ఎవ‌రూ ఎలాంటి మాటా చెప్ప‌కుండా త‌మ దారిన తాము వెళ్లిపోయారు. ఫోన్లు చేసినా.. నాకేం తెల్వ‌ద‌న్నా.. న‌న్నే వ‌దిలేయ‌వే.. ఆ విష‌యం గురించి మాట్లాడొద్దు ప్లీజ్ అన్న మాట‌లు త‌మ‌కు స‌న్నిహిత‌మైన పాత్రికేయుల‌తో చెప్ప‌టం క‌నిపించింది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ హ‌డావుడిగా ఢిల్లీకి వెళ్ల‌టం.. అక్క‌డ కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. త‌ర్వాత ప‌లువురితో మాట్లాడిన‌ట్లుగా స‌మాచారం అందుతోంది.

ఉద‌యం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. అంతే హ‌డావుడిగా సాయంత్రానికి హైద‌రాబాద్‌కు చేరుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఢిల్లీ నుంచి మంత్రి కేటీఆర్ వ‌చ్చిన కాసేప‌టికే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నివాస‌మైన రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌టం.. భేటీ కావ‌టం జ‌రిగింది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ముందు గ‌వ‌ర్న‌ర్ తో ముచ్చ‌టించ‌టం గ‌డిచిన కొంత‌కాలంగా కేసీఆర్ చేస్తున్న‌దే.

ఆయ‌న‌తో భేటీ త‌ర్వాత‌.. కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వార్త‌లు మీడియాలో జోరుగా వ‌చ్చాయి. ఢిల్లీకి కేటీఆర్ వెళ్లి రావ‌టం.. గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు. ముంద‌స్తు అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English