మ‌రి.. మీరు చేసిందేంది చిన్న‌మ్మ‌?

మ‌రి.. మీరు చేసిందేంది చిన్న‌మ్మ‌?

నీతులు ఎవ‌రైనా చెబుతారు. అందుకు తెలుగునాట చిన్న‌మ్మ కూడా మిన‌హాయింపు కాదు. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెను ఏరికోరి నెత్తిన పెట్టుకున్న తెలుగోళ్ల‌కు.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రోళ్ల‌కు ఆమె ఎంత చేయాలో అంత చేశారు. హైద‌రాబాద్‌లో ఉంటూ.. పార్ట్ టైం పొలిటిషియ‌న్ మాదిరి అప్పుడప్పుడు ఆంధ్రాకి వ‌చ్చి రాజ‌కీయాలు చేసే ఆమెను నెత్తిన పెట్టుకొని.. మా ఎన్టీవోడి కుమార్తె.. మా ఎన్టీవోడి కూతురంటూ ఎంపీగా గెలిపించిన ఆంధ్రుల రుణాన్ని.. విభ‌జ‌న స‌మ‌యంలో ఎంత న్యాయం చేయాలో అంత చేస్తూ హ్యాండిచ్చిన వైనం తెలిసిందే.

రాష్ట్ర విభ‌జ‌న వేళ‌.. త‌న‌కున్న పేరు ప్ర‌ఖ్యాతుల్ని త‌న వ్య‌క్తిగ‌త అవ‌కాశాలు.. ప్ర‌యోజ‌నాల కోస‌మే వినియోగించుకున్నారేకానీ.. ఐదు కోట్ల ఆంధ్రుల గురించి ఆమె పెద్ద‌గా ఆలోచించ‌లేద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. విభ‌జ‌న నేప‌థ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె తాజాగా కాంగ్రెస్ పార్టీలో జ‌త క‌లుస్తార‌న్న మాట వినిపిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీరుపై చిన్న‌మ్మ పురంధేశ్వ‌రి స్పందిస్తూ.. ఈ పొత్తును ఎన్టీఆర్ కుమార్తె హోదాలో వ్య‌తిరేకించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆమె.. కాంగ్రెస్ పార్టీతో బాబు పొత్తు పెట్టుకోవాల‌న్న నిర్ణ‌యంపై మండిప‌డుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ పెట్టిందే కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా అని.. అలాంట‌ప్పుడు ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ తో టీడీపీ జ‌త క‌ల‌వ‌టాన్ని తాను ఒప్పుకోన‌ని స్ప‌ష్టంచేశారు. చిన్న‌మ్మ మాట‌లు బాగానే ఉన్నా.. మ‌రి.. అదే ఎన్టీఆర్ కుమార్తె హోదాలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరిన‌ట్లు?  ఎందుకు అదే పార్టీ త‌ర‌ఫున రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన‌ట్లు?  కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్ర‌మంత్రిగా ఎందుకు బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన‌ట్లు? త‌న ప్ర‌యోజ‌నాల కోసం ఎన్టీఆర్ కుమార్తెన‌న్న విష‌యాన్ని వ‌దిలేసి మ‌రీ కాంగ్రెస్ తో అంట‌కాగిన పురంధేశ్వ‌రికి గ‌తం గుర్తు లేదా? అదే ఉంటే.. వ‌ర్తమానంలో బాబునుఆమెను ఎందుకు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు?  బాబుకు నీతులు చెబుతున్న ఆమె.. తొలుత అలాంటి నీతులు తన‌కు వ‌ర్తిస్తాయ‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు