పీకే రిపోర్ట్ చూసి జ‌గ‌న్ టీవీ ప‌గ‌ల‌కొట్టాడ‌ట‌!

పీకే రిపోర్ట్ చూసి జ‌గ‌న్ టీవీ ప‌గ‌ల‌కొట్టాడ‌ట‌!

రాజ‌కీయం అన్నాక విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు మామూలే. కానీ..కొన్ని మాత్రం ఇందుకు భిన్నంగా కొంత ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. రోటీన్ విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా కొన్ని మాట‌లు మాత్రం మ‌స్తు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అలాంటి ముచ్చ‌ట‌నే చెప్పుకొచ్చారు ఏపీ మంత్రి దేవినేని ఉమ‌.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో దేవినేని ఉమ ఎంత క‌చ్ఛితంగా ఉంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలా అని తొంద‌ర‌ప‌డ‌టం.. నోరు జార‌టం అన్న‌ది క‌నిపించ‌దు. మాట పెళుసుగా ఉండ‌టం.. ప‌గ‌ల‌కొట్టేలా ఉండే వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌దు. వాస్త‌వానికి ఈ త‌ర‌హా నేత‌లు త‌ర‌చూ త‌మ వ్యాఖ్య‌ల‌తో వివాదాల్లో చిక్కుకుపోతుంటారు. కానీ.. ఉమ అలాంటోడు కాదు.
ఎదుటోడి మీద విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డిన‌ప్పుడు.. మాట జార‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారాయ‌న‌. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తాజాగా ఆయ‌న చేసిన విమ‌ర్శ అంద‌రి దృష్టిని ఆక‌ర్‌షించ‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. అంత‌కు మించి.. జ‌గ‌న్ ఇమేజ్ ను భారీ డ్యామేజ్ చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కూ దేవినేని ఉమ చేసిన ఆ విమ‌ర్శ ఏమిటంటే..వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రావంటూ జ‌గ‌న్ నియ‌మించుకున్న ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారు పీకే అలియాస్ ప్ర‌శాంత్ కిశోర్ రిపోర్ట్ ఇచ్చార‌న్నారు. ఈ నివేదిక‌ను చూసిన జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హంతో త‌న ఎదుట ఉన్న టీవీని ప‌గుల‌గొట్టార‌న్నారు.

జ‌గ‌న్ కు సీఎం ప‌ద‌వి పిచ్చి ప‌ట్టుకుంద‌ని.. అభ‌ద్ర‌తాభావంతో ఆయ‌న ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌న్నారు. సాగునీటి రంగంలో జ‌గ‌న్ కు అవగహన లేద‌న్న ఆయ‌న‌.. ప్రాజెక్టులు పూర్తి అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాలేర‌న్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా కేసులు వేయిస్తున్న‌ట్లుగా మండిప‌డ్డారు. మిగిలిన విమ‌ర్శ‌ల‌న్నీ మామూలే అయినా.. టీవీ ప‌గుల‌గొట్టిన ఎపిసోడ్ మాత్రం అంద‌రి నోటా చ‌ర్చ‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు