కేసు పాతదే, శిక్ష కొత్తదా?

కేసు పాతదే, శిక్ష కొత్తదా?

మంత్రి పార్ధసారధిగారిపై 'ఫెరా' కేసు ఉంది. ఈ కేసులో ఆయన్ను దోషిగా న్యాయస్థానం నిర్ధారించి శిక్ష కూడా విధించడం జరిగింది. కోర్టు శిక్ష విధించాక, దోషిగా తేలాక మంత్రి పదవిలో ఎలా ఉంటారని పార్ధసారధిపై విమర్శలు వస్తుండగా, అది 20 ఏళ్ళ క్రితం కేసని పార్ధసారధి వితండవాదం చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

కేసు పాతదో, కొత్తదో.. శిక్ష మాత్రం కొత్తదే కదా. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులే ఏమీ చేయలేక పదవులకు రాజీనామాలు చెయ్యాల్సి వస్తున్నది. దోషిగా తేలిన వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగడం నైతికత అనిపించుకోదు. ప్రజా ప్రతినిథులుగా వీరే చట్టాలను గౌరవించక, రాజకీయాల్లో విలువలు పాటించకపోతే ఎలాగ? 'స్టే' తెచ్చుకున్నంతమాత్రాన కింది కోర్టు వేసిన దోషి అన్న ముద్ర చెరిగిపోదు. ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం పార్ధసారధిని దోషిగా నిర్ధారించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు