లైంగిక ఆరోపణలు: డీఎస్‌ కుటుంభానికి మళ్ళీ నిరాశే

లైంగిక ఆరోపణలు: డీఎస్‌ కుటుంభానికి మళ్ళీ నిరాశే

సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌కు నిరాశ ప‌ర్వం ఎదుర‌వుతోంది. పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత స‌హా నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన  ఉదంతం విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డకుండా ఉండ‌టం ఉత్కంఠ సాగుతున్న నేప‌థ్యంలో మ‌రో ట్విస్ట్ ఆయ‌న కుమారుడిపై ఆరోప‌ణ‌ల ప‌ర్వం తెర‌మీద‌కు వ‌చ్చింది.

డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. దీనిపై ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌పై నిర్భ‌య కేసు న‌మోదు చేయ‌డం, అనంత‌రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించ‌డం తెలిసిన సంగ‌తే. దీనిపై బెయిల్ కోర‌గా నిరాక‌ర‌ణ ఎదురైంది.

నర్సింగ్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజరు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను జడ్జి తిరస్కరించారు. ఈ మేరకు నిజామాబాద్‌ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రమేష్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్నందున 11 మంది విద్యార్థినులు బాధితులు అయినందున, బెయిలు మంజూరు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. విచారణ అనంతరం పరిశీ లిస్తామని తెలిపారు. బెయిల్ కోరిన సంజ‌య్ విషయంలో తాజాగా డీఎస్ ఇంప్లీడ్ అయ్యి బెయిల్ మంజూరికి విన‌తి పెట్టుకున్నారు. అయితే, తాజాగా బెయిల్‌కు నో చెప్ప‌డంతో ఇటు డీఎస్ అటు ఆయ‌న త‌న‌యుడు నిరాశ‌కు గుర‌వ‌డం మిన‌హా మ‌రే ఆప్ష‌న్ లేదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు