ఇకపై మీ ఓటు సేఫ్..

ఇకపై మీ ఓటు సేఫ్..

ఎన్నికలు జరిగిన తర్వాత ఓటమి పాలైనా ప్రతీ పార్టీ కూడా ఈవీఎంలు ట్యాపరింగ్‌కు జరిగాయని, అధికార పార్టీ ఇదంతా చేసిందని అనడం మనం వింటూనే ఉన్నాం. ఇది నిజం కావచ్చు అన్న అనుమానం సగటు ఓటరకు ఉండవచ్చు. ఇకపై ట్యాపరింగ్ చేసే అవకాశం లేదని అంటున్నారు ఎన్నికల అధికారులు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషీన్లకు, ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడట్ ట్రయల్ (వీవీపీఏటీ)లను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అంటే ఓటారు ఓటు వేయగానే తమ ఎవరికి ఓటు వేసమన్నది వెంటేనే తెలిసిపోతుంది.

ఏ వీవీపీఏటీ విధానం ఇప్పటీకే కొన్ని రాష్ట్రాలలో అమలు చేసినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో దేశమంతటా వీటిని ప్రవేస పెడతామని అన్నారు. దేశ వ్యప్తంగా దాదాపు 17 లక్షల యంత్రాలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు ముందస్తు ఎన్నికలువచ్చినా వీటినే ఉపయోగించాలిన అందుకు 84,400 యంత్రాలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఓటరు ఓటు వేయగానే వీవీసీఏటీలో అనగా ఓటర్ వేరిఫికేషన్పేపర్ ఆడిట్ ట్రాయల్ నుండి ఒక రసీదు వస్తుంది, ఓటరు తాను వేసిన ఓటు సరి చూసుకుని ప్రక్కనే ఉన్న బ్యాలట్ బాక్సులో ఆ రసీదును వేయాల్సి ఉంటుంది. దీని వలన ఏ కారణం చేతనైన ఈవీఎంలు పనిచేయనట్లేతే , బాక్సులో ఉన్న ఓట్లతో, ఓట్లను లెఖించ వచ్చు. దీని వలన రీపోలింగ్‌ జరపాల్సిన అవసరం రాదని అధికారులన్నారు. మొదట వీటిని కొన్ని రాష్ట్రాలలో ప్రయోగించి సఫలమయ్యారు.

తెలంగాణలో ముందస్తు జరిగినప్పటికీ వీటిని ఉపయోగించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. గతంలో కొన్ని సార్లు ఈవీఎంలు పనిచేయకపోవడం వలన ఆయా కేంద్రాలలో రీపోలింగ్ జరపాల్సివచ్చింది. దాని వలన ఇటు ప్రభుత్వం అధికారులు, ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు.అంతే కాకుండా ప్రభుత్వ సొమ్ము కూడా దుర్వినియోగం అవ్వదని అధికారులు అంటున్నారు. సదరు ఓటరు కూడా తాను వేసిన ఓటు, సరి చూసుకునే అవకాశం ఉన్నందున తన ఓటు తాను అనుకున్న అభ్యర్దికే పడినందుకు సంత్రుప్తి చెందుతాడని అధికారులు అన్నారు. ప్రస్తుతం 17 లక్షల యంత్రాలు తయారయ్యాయని, అవసరాన్ని బట్టి వీటిని ఇంకా తయారుచేస్తామని అన్నారు. రానున్న రోజులలో ఎన్నికలు తర్వాత నాయకులు ఈవీఎంల నుంచే కాకుండ వీవీపీఏటీ (బ్యాలట్ బాక్సు) ల నుంచి కూడా ఓట్లను లెక్కించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు