అయ్యో జనసేన.. పేరుకే చే‌రరికలు, ఏరీ మెరికలు

అయ్యో జనసేన.. పేరుకే చే‌రరికలు, ఏరీ మెరికలు

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు తెగ హడావుడి చేస్తున్నారు. భారీ చేరికలు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. కొద్దికాలం కిందటే జనసేనలో చేరిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మళ్లీ తన కుమారుడితో కలిసి పవన్‌ను కలిసి జనసేన కండువా కప్పుకోవడం.. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ కూడా చేరడం.. మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి చేరికతో సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు తెగ హడావుడి చేస్తున్నారు. అయితే.. వారి హడావుడిలో కొంత అర్థం ఉంది. ఆర్నెళ్లుగా పవన్ హడావుడి చేస్తున్నా ఒక్క చేరికా లేకపోవడం... రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన ముఖం ఇంతవరకు ఆ పార్టీలో లేకపోవడం(పవన్‌ను మినహాయించాలి)తో బయటకు ఎంత బిల్డప్ ఇస్తున్నా లోలోన మాత్రం తెగ పార్టీ లీడర్, క్యాడర్(?) తెగ మథనపడేవారు. రాష్ట్రంలో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయడానికైనా అభ్యర్థులు దొరుకుతారా అన్న భయం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు చేరడంతో జనసేన బ్యాచ్‌కు ఏనుగెక్కినంత సంబరమైపోయింది.

అయితే... ఈ చేరిన నేతలు జనసేనకు ఎంతవరకు ఉపయోగపడతారన్నది అనుమానమే. ముత్తా గోపాల కృష్ణ చేతిలో పత్రిక, కొత్తగా పెట్టిన టీవీ చానల్ ఉండడంతో ప్రచార పరంగా ఉపయోగం ఉండొచ్చు. అంతేకానీ క్షేత్ర స్థాయి రాజకీయాల్లో ఆయనెంతవరకు ఉపయోగపడతారో వేరే చెప్పక్కర్లేదు.
    
ఇక పంతం నానాజీ కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరుతానని ప్రకటిస్తే ఆయన వెంట ఒక్కరంటే ఒక్క కార్యకర్త కూడా వెళ్తామని చెప్పలేదు. ఇదీ ఆ నేత పరిస్థితి. ఆయనతో జనసేన ఏం సాధిస్తుందో చూడాలి.
    
మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి విషయం కొంత వేరు. యాక్టివ్ పొలిటీషియన్ అయిన ఆయనకు క్షేత్ర స్థాయిలో పట్టుంది. జనసేన సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఆయన వల్ల పార్టీకి ఆ ప్రాంతం వరకు ప్రయోజనం ఉండొచ్చు.
    
మరి.. ఇలా చోటామోటా నేతలతో పవన్ ఎంతవరకు నెట్టుకొస్తారో.. ఆయన చెబుతున్నట్లు 175 సీట్లూ ఎలా గెలుచుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు