జయలలితపై ఒకేసారి రెండు బయోపిక్స్

జయలలితపై ఒకేసారి రెండు బయోపిక్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా త్వరలోనే సినిమా మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ  ధ్రువీకరించింది.ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌ను, హిందీలో కపిల్ దేవ్ బయోపిక్‌ను నిర్మిస్తున్న విష్ణు ఇందూరి సంస్థ వైబ్రి మీడియాఇటీవలే జయలలిత బయోపిక్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.  

‘నాన్న’.. ‘కణం’ చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.  తెలుగులో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో రామారావు సతీమణి బసవతారకం పాత్ర చేస్తున్న విద్యా బాలన్ జయలలితగా నటిస్తుందని అంటున్నారు.

కాగా ఈ సినిమా ప్రకటన వచ్చిన కొన్ని రోజుల్లోనే జయలలితపై మరో బయోపిక్ తెరమీదికి రావడం విశేషం. తమిళ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా.. జయలలితపై సినిమా తీయడానికి సిద్ధం కావడం విశేషం. 77 ఏళ్ల భారతీరాజా దర్శకుడిగా సినిమా చేసి చాలా కాలమైంది. ఆయన చివరగా 2013లో ‘అన్నకొడి’ అనే సినిమా తీశాడు. తర్వాత మెగా ఫోన్ పక్కన పెట్టేశాడు.

ఆయనలో జయలలిత మళ్లీ కదలిక తెచ్చింది. ఆదిత్య భరద్వాజ్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడట. ఈ చిత్రానికి సంగీతం అందించడం కోసం ఇళయరాజాను సంప్రదిస్తున్నారట. మరి ఈ చిత్రంలో జయలలితగా ఎవరు నటిస్తారో చూడాలి. ఒకేసారి జయలలితపై తెరకెక్కబోయే రెండు బయోపిక్స్‌లో ఏం వైవిధ్యం చూపిస్తారో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు