సంకీర్ణంలో బాబు కీలకం

సంకీర్ణంలో బాబు కీలకం

జాతీయ రాజకీయాలలో రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు చక్రం తిప్పనున్నారా. గతంలోలాగా ప్రధాని ఎవరో చంద్రబాబే నిర్ణయించనున్నారా. ఔనననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ స్దాయిలోను, ప్రాంతీయ స్ధాయిలోను రాజకీయాలను పరిశీలిస్తే చంద్రబాబు నాయడే కీలకంగా మారనున్నారు. బిజేపీకి వ్యతిరేకంగా కాంగ్రస్ పార్టీ కూడగట్టే అన్నీ పార్టీలతోను చంద్రబాబు నాయుడు జతకట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కి వ్యతీరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టినా వాస్తవ పరిస్తితులను పట్టి కాంగ్రెస్ తో చేతులు కలపాలన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. నాలుగేళ్ల స్నేహంతో నరేంద్ర మోదీ, రెండున్నర దశాబ్దాల మిత్రత్వంతో ఉన్న కె. చంద్రశేఖర రావు ఒకేసారి తనను మోసం చేసారని చంద్రబాబు నాయుడు రగిలిపోతున్నారు. కాంగ్రెస్  తో చేతులు కలిపితే అటు కేంద్రంలో నరేంద్ర మోదీని తెలంగాణలో కేసీఆర్‌ను ఒకేసారి దెబ్బ కొట్టవచ్చునన్నది చంద్రబాబు వ్యూహం. దీనికి ఒక పొత్తు రెండు దెబ్బలుగా పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏర్పాటు చేస్తారనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఏ రాజకీయ పార్టీ నుంచి ఆమోదం రాదని, వారు చేతులు కలపరని చంద్రబాబు నాయుడి నమ్మకం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. తీరా తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ దెబ్బతో దిమ్మతిరిగింది. రేపు ఫెడరల్ ప్రంట్ అంటూ ఏర్పాటు చేస్తే ఇతరభాగసౌమ్య పార్టీలను కూడా కేసీఆర ఇలాగే ఆడుకుంటారని
చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. జిత్తులమారి కేసీఆర్ కంటే ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీయే నమ్మకమైనది అని చంద్రబాబు నాయుడు తన రాజకీయ మిత్రులకు సద్ది చెప్పాలనుకుంటున్నారు. కేంద్రంలోను తెలంగాణలోను కూడా పాలకుల మార్పే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ఏకమయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ మేరాకు ఈ ఇద్దరూ కలసి పనిచేయాకపోయినా జాతీయ స్దాయిలో మాత్రం వీరి కలయిక అనివార్యంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడంతో అదే జరిగితే ఏపిలో కూడా తనకు కలసి వస్తుందని చంద్రబాబు నాయుడి భావన. గతంలో జాతీయ స్దాయిలో దౌత్యం నెరపిన చంద్రబాబు నాయుడకు ఇప్పుడు అదే పని చేయాడం ఏమంత కష్టం కాదు. ఆనాటి జాతీయానుభవంతో నేటి రాజకీయాలలో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు