తెలుగు వద్దు...హిందీయే ముద్దు

తెలుగు వద్దు...హిందీయే ముద్దు

భారతీయ జనతా పార్టీ. మైనారిటీలకు వ్యతీరేకమైన పార్టీ అని పేరు తెచ్చుకుంది. ఆ పార్టీ నాయకుల ప్రవర్తన కూడా అలాగే ఉండేది. దీనికి అటల్ మినహాయింపు. ఆయనకు ప్రజలే తప్ప వారిని కులాలుగా, మతాలుగా చూడడం తెలీదు. దీనికి ప్రత్యక్ష్య సాక్ష్యం తెలుగు నగరమైన గుంటూరు. అక్కడికి అటల్ బిహారి వాజ్ పేయి పలు హోదాలలో చాలా సార్లు పర్యటించారు. 


గుంటూరు నగరంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే పట్టణ ఓటర్లలో ముస్లింలే ఎక్కువ మంది. ఎన్నికలలో అభ్యర్దుల గెలుపోటములు నిర్ణయించేది కూడా వారే. వీరంతా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని జనసంఘ, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌‌లకు బద్ద శత్రువులని ప్రచారం. అందులో వాస్తవం ఎంతుందో తెలియదు కాని అక్కడ ముస్లీం మైనారిటీలు మాత్రం అటల్ బిహారి వాజ్ పేయి అభిమానులు.

1968వ సంవత్సరంలో జనసంఘ్ అధ్యక్షుడిగా అటల్ బిహారి వాజ్ పేయి గుంటూరు వచ్చారు. అక్కడ కొన్ని అభివ్రుద్ది కార్యక్రమాలలో పాల్గోన్నారు. ఆ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. సమావేశ మందిరంలో ముస్లీం మైనారిటిలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమానార్హం. అటల్ బిహారి వాజ్ పేయి తన ప్రసంగాన్ని హిందీలో చేసారు. ఆ ప్రసంగానికి స్దానిక న్యాయవాది, బిజేపీ నాయకుడు జూపూడి యజ్ననారయణ తెలుగు అనువాదం చేసారు. అయితే అటల్ బిహారి వాజ్ పేయి వాగ్ధాటి ముందు తెలుగు అనువాదం పేలవంగా మారింది.

అటల్ బిహారి వాజ్ పేయి ప్రసంగంలో ఉన్న తళుకులు, చెళుకులు  తెలుగు అనువాదంలో వినిపించలేదు.అటల్ బిహారి వాజ్ పేయి తన ప్రసంగంలో కొన్నిసార్లు కవితాత్మకంగానూ, మరికొన్ని సార్లు ఉద్వేగంగాను, ఇంకొన్ని సార్లు నవ్వుల పువ్వులు పూయిస్తూ ప్రసంగిస్తారు. తెలుగు అనువాదంలో ఇవేవి కానరాలేదు. దీంతో సభలో ఉన్న ముస్లీం మైనారిటీ యువకులు, మహిళలు ఒక్కసారిగా లేచి " మాకు తెలుగు అనువాదం వద్దు. అటల్ బిహారి వాజ్ పేయి గారి హిందీ ప్రసంగమే కావాలి. ఆ ప్రసంగంలోని అధ్బుతాలను అనువాదం ద్వారా మాకు అందకుండా చేస్తున్నారు  " అన్నారట. ఇది కూడా వారు హిందీలోనే చెప్పడం విశేషం. సభికుల నుంచి వచ్చిన సూచనతో అరగంట మాట్లాడాలనుకున్న అటల్ బిహారి వాజ్ పేయ తన ప్రసంగాన్ని గంటకు పైగా కొనసాగించారు. ఇదీ అటల్ బిహారి వాజ్ పేయిలోని మరో కోణం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు