4.. 5.. 6.. 7.. వాజ్ పేయ్ కు తెలుగు ప‌త్రిక‌ల నివాళి!

4.. 5.. 6.. 7.. వాజ్ పేయ్ కు తెలుగు ప‌త్రిక‌ల నివాళి!

ఒక పే..ద్ద సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు.. కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ప్పుడు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ఇచ్చే ప్రాధాన్య‌త ఎంత‌న్న‌ది కూడా ఒక లెక్కే. కోట్లాదిమందిని ప్ర‌భావితం చేసే మీడియాలో అగ్ర‌స్థానంలో ఉన్న సంస్థ‌ల నిర్ణ‌యాల వెనుక చాలానే లెక్క‌లు ఉంటాయి.

మాజీ ప్ర‌ధాని.. దేశ రాజ‌కీయాల్లో శిఖ‌ర స‌మానుడైన అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ మ‌హాభినిష్క్ర‌మ‌ణ సంద‌ర్భంలో తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా భావించే నాలుగు ప‌త్రిక‌లు ఇచ్చిన ప్రాధాన్య‌త ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ లేన‌ట్లుగా ఉండ‌టం విశేషం.

తెలుగు దిన‌ప‌త్రిక‌లు అన్న వెంట‌నే గుర్తుకొచ్చే మొద‌టి నాలుగింటిలో స‌ర్య్కులేష‌న్.. ఇత‌ర‌త్రా విష‌యాల ఆధారంగా   చూస్తే.. ఈనాడు మొద‌టిస్థానంలో..  సాక్షి రెండో స్థానంలో.. ఆంధ్ర‌జ్యోతి మూడో స్థానంలో.. తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన న‌మ‌స్తే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంటాయి.

వాజ్ పేయ్ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఈ నాలుగు ప‌త్రిక‌లు మొద‌టిపేజీలో భారీ ప్రాధాన్యాన్ని ఇచ్చినా.. ఆంధ్ర‌జ్యోతి అయితే.. త‌న మాస్ట‌ర్ హెడ్ ను వాజ్ పేయ్ కోసం ప‌క్క‌న పెట్టేసింది. మొద‌టి పేజీ మొత్తాన్ని వాజ్ పేయ్ కు కేటాయించింది. ఈనాడు అయితే త‌న మొద‌టిపేజీని 60 శాతం వ‌ర‌కూ కేటాయించింది. కింద రెండు ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌టంతో.. అక్క‌డితో ఆపింది. సాక్షి మాత్రం కొల‌త వేసిన‌ట్లుగా మ‌ధ్య భాగానికి ఆపేసింది. న‌మ‌స్తే తెలంగాణ సైతం అదే విధానాన్ని ఫాలో అయ్యింది.

మేరున‌గం లాంటి వాజ్ పేయ్ ఆస్త‌మ‌యం నేప‌థ్యంలో ప్ర‌త్యేక క‌థ‌నాల‌కు సంబంధించి ఈ నాలుగు ప‌త్రిక‌లు నాలుగు ర‌కాలుగా నిర్ణ‌యం తీసుకోవ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. ఆంధ్ర‌జ్యోతి వాజ్ పేయ్ ప్ర‌త్యేక క‌థ‌నాల కోసం ఏకంగా 7 పేజీలు డెడికేట్ చేస్తే.. ఈనాడు ఆరు పేజీల్ని కేటాయించింది. ఇక‌.. సాక్షి ఐదు పేజీల్లో వాజ్ పేయ్ ప్ర‌త్యేక క‌థ‌నాలు అందిస్తే.. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక మాత్రం నాలుగు పేజీల‌కే ప‌రిమితం చేసింది. నిజానికి.. ఒక పెద్ద ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఇంచుమించుగా ఉండే మీడియా సంస్థ‌ల జ‌డ్జిమెంట్‌కు భిన్న‌మైన ప‌రిస్థితి వాజ్ పేయ్ ఆస్త‌మ‌యం క‌వ‌రేజ్ లో క‌నిపించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు