దేశంలో అత్యంత ధ‌న‌వంతురాలు ఈమే

దేశంలో అత్యంత ధ‌న‌వంతురాలు ఈమే

మ‌న‌దేశంలో అత్యంత సంప‌న్న‌వంతురాలైన మ‌హిళ ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఠ‌క్కున గుర్తుకురాదు. సంపన్న పురుషులు ఎవ‌రంటే వెంట‌నే స్పూరించిన‌ట్లు మ‌హిళ పేరు త‌ట్ట‌దు.

దేశంలో అత్యుత్తమ 10 మంది సంపన్న మహిళల్లో స్మితా కృష్ణ (గోద్రేజ్‌ గ్రూప్‌) టాప్‌లో నిలిచారు. 100 మంది మహిళా కుబేరులతో కోటక్‌ వెల్త్‌, హురున్‌లువిడుదల చేసిన జాబితాలో ఈ  మేర‌కు ఆమె మొద‌టి స్థానం ద‌క్కించుకున్నారు. రోష్ని నాడార్‌ (హెచ్‌సీఎల్‌ టెక్‌), ఇందు జైన్‌ (బెనెట్‌ కోల్‌మన్‌)లకు త‌రువాతి స్ధానం లభించింది.

కోట‌క్‌వెల్త్ విడుద‌ల చేసిన నివేదిక‌లో అగ్ర‌స్థానం సంపాదించుకున్న స్మితా కృష్ణ  గోద్రేజ్‌ గ్రూప్‌ మూడో తరం వారసురాలు. ఆమె సంపద విలువ రూ.37,570 కోట్లు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు సభ్యురాలైన ఆమె.. మొత్తం గ్రూప్‌లో అయిదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నారు. 

2014లో ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబాకు చెందిన బంగ్లాను రూ.371 కోట్లకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ప్ర‌థ‌మ స్థానంలో నిలిచి మీడియా దృష్టిని ఆక‌ర్షించారు. ఇక రెండో స్థానంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రోషిణి నాడార్‌ (సంపద రూ.30,200 కోట్లు) ఉన్నారు. రూ.26,240 కోట్ల నికర ఆస్తితో టైమ్స్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ ఇందు జైన్‌ మూడో స్థానంలో నిలిచారు.

దేశంలో అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన బెనెట్‌ కోల్‌మన్‌కు ఆమె ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎకనామిక్‌ టైమ్స్‌, ఫెమినా వంటి పత్రికలను ఈ సంస్థ కలిగి ఉంది. ఇలా టాప్ 3లో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లే నిలిచారు. కాగా, మొదటి 10 మంది మహిళా సంపన్నుల కనీస నికర ఆస్తి విలువ రూ.8,000 కోట్లు కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు