మీడియాపై మోదీ డేగకన్ను..!?

మీడియాపై మోదీ డేగకన్ను..!?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో మీడియాను నియంత్రించనున్నారా..? వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పత్రికలు, ఛానళ్లు ఆయన ఆథీనంలో ఉండాలని వాంఛిస్తున్నారా..? ప్రధాని చేస్తున్న చర్యలు ఆయన సహచరులు చూపుతున్న ఉత్సాహం చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా నరేంద్ర మోదీ అన్ని ఆయధాలు ప్రయోగించాలనుకుంటున్నారు.

ఇందులో భాగంగా మీడియాను తన అదుపాజ్నలలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఏ మీడియా ఎలా వ్యవహరిస్తోంది, తనకు అనుకూలంగా ఎవరు రాస్తున్నారు, తనకు వ్యతిరేకంగా ఎవరు రాస్నున్నారు వంటి అంశాలను నిశితంగా పరీశీలిస్తున్నారు. ఒక విధంగా మీడియపై ప్రధాని మోదీ డేగ కన్ను వేస్తున్నారు. ఈ పని కోసం ఏకంగా 200 మంది జర్నలిస్టులను వివిధ రాష్ట్రాలలో నియమించినట్లు సమాచారం.

వీరంతా రోజువారి నివేదికలు అందజేస్తారు. స్దానిక పత్రికలలోను, ఛానళ్లలోను ఎలాంటి కథనాలు వస్తున్నాయో ఆ నివేదికలో పొందుపరుస్తారు. ఆ నివేదిక ఆధరంగా ఏ మీడియాతో ఎలా వ్యవహరించాలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సహచరులకు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు.

ఢిల్లీలోను సీబీఐ కార్యలయం పక్కనే ఈ నిఘే కార్యలయాన్ని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. అక్కడి నుంచే మీడియాపై నియంత్రణ ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశంలోని మీడియా సంస్థలు కొన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి సరెండర్ అయినట్లు తెలుస్తోంది. స్దానిక నాయకుల ద్వార మీడియా అధిపతులు, ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి సహకరించాలని, అలకాని పక్షంలో తాము అధికారంలోకి వస్తే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని హెచ్చరికలు సైతం చేస్తున్నారు.
పార్టీలో అంతర్గతంగా నిర్వహించిన సర్వేలను యాజమాన్యాలకు చూపించి గెలుపు తమదేనని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాదిలో కొన్ని పత్రికలు ఇప్పటికే తమ గుప్పిట్లో ఉన్నాయని ఇతర పత్రికలు కూడా తమకు అనుకూలంగా మారలని చెబుతున్నట్లు సమాచారం. ఈ నిఘా విభాగానికి పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్ బాధ్యుడుగా నియమించినట్లు తెలిసింది. ముందునుంచీ పత్రికల వారితో మంచి సంబంధాలు నెరపుతున్న రామ్‌మాధవ్ అయితే సానుకూలంగా ఉంటుందని ప్రధాని ఆలోచన.

ఇంతకు ముందు హైదారబాద్ కేంద్రంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ పత్రిక ప్రజ్నాభారతికి రామ్‌మాధవ్ సంపాదకలుగా వ్యవహరించారు. ఆ పత్రిక హిందుత్వ వాదులందరికి నచ్చింది. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీడియాపై నియంత్రణకు వాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారు. మరోవైపు ఈ మీడియా నియంత్రణపై పలువురు ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, యాజమాన్యలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మీడియాను నియంత్రిచడమంటే ప్రజాసౌమ్యాన్ని అపహాస్యం చేయటమేనని వారంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు