మూడు పెళ్లిళ్లు నా క‌ర్మ‌.. మీలా బ‌లాదూర్ కాదు జ‌గ‌న్‌!

మూడు పెళ్లిళ్లు నా క‌ర్మ‌.. మీలా బ‌లాదూర్ కాదు జ‌గ‌న్‌!

కార్ల‌ను మార్చిన‌ట్లుగా పెళ్లాల్ని మారుస్తాడంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలిసిందే. దీనిపై తాజాగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప‌వ‌న్‌. త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ మండిప‌డ్డారు.

త‌న జీవితంలో ర‌హ‌స్యాలేమీ లేవ‌న్న ఆయ‌న‌.. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ దెప్పి పొడుస్తున్నార‌ని.. మూడు పెళ్లిళ్లు త‌న క‌ర్మ‌గా అభివ‌ర్ణించారు. ఒకే పెళ్లి కుద‌ర్లేద‌ని.. అందుకు తానేం చేయ‌న‌న్న ప‌వ‌న్‌.. ఒళ్లు పొగ‌రెక్కి మూడు పెళ్లిళ్లు చేసుకోలేద‌న్నారు. తాను జ‌గ‌న్ మాదిరి బ‌లాదూర్ కాదంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

కార్ల‌ను మార్చిన‌ట్లుగా పెళ్లాల్ని మారుస్తాడంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ మొద‌ట్లో ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ మాట్లాడిన వైనంపై ఎవ‌రూ తొంద‌ర‌ప‌డొద్దంటూ మాట్లాడిన ప‌వ‌న్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ నుంచి పారిపోవ‌టం కాదు.. పోరాడాలంటూ పంచ్ విసిరిన ప‌వ‌న్ తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో జ‌గ‌న్ పై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా ఉంది. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు.. తాడేప‌ల్లి గూడెంల‌లో జ‌రిగిన స‌భ‌ల్లో మాట్లాడిన ప‌వ‌న్‌.. జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప‌వ‌న్ నుంచి భారీ పంచ్ లు జ‌గ‌న్ కు సిద్దంగా ఉన్న‌ట్లుగా తాజా వ్యాఖ్య‌లు చెబుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు