ప‌వ‌న్ పార్టీ గుర్తు పిడికిలి.. ఈ క్లారిటీ అవ‌స‌రం!

ప‌వ‌న్ పార్టీ గుర్తు పిడికిలి.. ఈ క్లారిటీ అవ‌స‌రం!

2019 ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అందుకు త‌గ్గ‌ట్లే కొంత‌కాలంగా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కొద్ది రోజులుగా ఉత్త‌రాంధ్ర‌.. గోదావ‌రి జిల్లాల మీద ఫోక‌స్ పెట్టిన ఆయ‌న‌.. ఆ ప్రాంతాల్లో పోరాట‌యాత్ర పేరిట స‌భ‌ల్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా నిడ‌ద‌వోలు.. తాడేప‌ల్లిగూడెంల‌లో ఏర్పాటు చేసిన స‌భ‌ల్లో మాట్లాడిన ప‌వ‌న్‌.. జ‌న‌సేన పార్టీ గుర్తుగా పిడికిలిని ఎంపిక చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. వాస్త‌వానికి పార్టీ ఆవిర్భావ సంద‌ర్భంగా పిడికిలి ఉన్న ఫోటోల్ని ప్ర‌ముఖంగా ప్ర‌ద‌ర్శించారు. పార్టీ గీతంపై త‌యారు చేసిన వీడియోలోనూ పిడికిలిని ప్ర‌ముఖంగానే చూపించేవారు.

అయితే.. దాన్నే పార్టీ గుర్తుగా తాజాగా ప్ర‌క‌టించారు ప‌వ‌న్‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ పార్టీ గుర్తు పిడికిలి అంటూ వైర‌ల్ అయ్యాక‌.. ఆ విష‌యం జ‌న‌సేనాధినేత నోటి నుంచి రావ‌టం. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. ప‌వ‌న్ ప్ర‌క‌టించిన పిడికిలి పార్టీ గుర్తు మాత్ర‌మే. అదేమీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తు ఎంత‌మాత్రం కాదు. ఎన్నిక‌ల సంఘం ప‌వ‌న్ పార్టీకి ఇంకా గుర్తు ప్ర‌క‌టించ‌లేదన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. సో.. పిడికిలి పార్టీ గుర్తు మాత్ర‌మే కానీ.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటు వేయాల్సిన గుర్తు ఎంత మాత్రం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు