ప‌వ‌న్ కు అశోక్ పంచ్!

ప‌వ‌న్ కు అశోక్ పంచ్!

ప‌వ‌న్ పై మ‌రోసారి పంచ్ వేశారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. ప‌వ‌న్ అంటే త‌న‌కెవ‌రో తెలీద‌ని.. ప‌వ‌న్ సినిమాలు చూడ‌లేద‌న్న మాట‌పై జ‌న‌సేన నేత‌లు.. కార్య‌క‌ర్త‌లే కాదు.. చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం తీవ్ర‌స్థాయిలో స్పందించ‌టం తెలిసిందే. అశోక్ గ‌జ‌ప‌తి రాజు చేసిన వ్యాఖ్య‌ను ప‌లుమార్లు ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. ఆయ‌న‌పై ప‌లుమార్లు పంచ్ లు వేశారు.

ప‌వ‌న్ పంచ్ ల ప్రభావ‌మో.. త‌న‌ను ఎవ‌రూ వేలెత్తి చూపించకున్నా.. ప‌వ‌న్ త‌న‌పై పంచ్ లు వేయ‌టాన్ని అశోక్ జీర్ణించుకోలేక‌పోయారేమో కానీ.. తాజాగా త‌న‌కు వచ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా పవ‌న్ పై త‌న‌దైన శైలిలో పంచ్ లు వేశార‌ని చెప్పాలి.  తాజాగా ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలోప‌వ‌న్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన సంద‌ర్భంగా అశోక్ గ‌జ‌ప‌తి రియాక్ట్ అయ్యారు.

ప‌వ‌న్ సినిమాలు చూడ‌న‌ని ఎందుకు అన్నార‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. ఎవ‌రో అడిగితే తాను.. ఆ మ‌నిషి తెలీద‌ని చెప్పాన‌న్నారు. ఎన్టీఆర్ సినిమాలే తాను చూడ‌లేద‌న్నారు. విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌చారం చేశాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు కానీ నేనూ.. ఆయ‌నా క‌లిసి ప్రచారం చేయ‌లేద‌న్న స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు అశోక్ గ‌జ‌ప‌తి రాజు.

ప‌వ‌న్ కు సంబంధించిన ప్ర‌శ్న‌కు మ‌రోసారి స‌మాధానం చెప్పే క్ర‌మంలో మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు. సీరియ‌స్ రాజ‌కీయాలు చేసే వారి గురించి తెలుసుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని.. అది లేకుంటే ప‌ట్టించుకోమ‌న్న మాట‌తో ప‌వ‌న్ రాజ‌కీయాల తీరును ఒక్క ముక్క‌లో తేల్చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాను కేంద్ర‌మంత్రిగా ఉన్నా త‌న గురించి చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చ‌న్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. ప‌వ‌న్ సినిమాలు తాను చూడ‌లేద‌న్న మాట‌కు మ‌రింత వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాను సినిమాలు చూసేదే త‌క్కువ‌ని.. అందులోనూ తెలుగు సినిమాలు మ‌రింత  త‌క్కువ‌గా చూస్తాన‌ని చెప్ప‌టం ద్వారా.. ప‌వ‌న్ సినిమాలు తాను చూసే అవ‌కాశం లేద‌న్న విష‌యాన్ని మ‌రింత వివ‌రంగా చెప్పార‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు