న్యూయార్స్ టైమ్స్ లో తెలుగోడి కికి చాలెంజ్!

న్యూయార్స్ టైమ్స్ లో తెలుగోడి కికి చాలెంజ్!

కొద్ది రోజులుగా `కికి చాలెంజ్ `ఇంట‌ర్నెట్ ను ఊపేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చాలెంజ్ ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, దానిని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌మోట్ చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు నెత్తీ నోరూ మొత్తుకుంటున్నారు. చాలా చోట్ల కికి చాలెంజ్ పై నిషేధం కూడా విధించారు.  

ఈ క్ర‌మంలో కొంత‌మంది గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ...చాలామంది తాము కికి చాలెంజ్ లో పాల్గొన్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఇద్ద‌రు తెలంగాణ యువ‌కులు పోస్ట్ చేసిన‌ కికి చాలెంజ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ వీడియోకు అంత‌ర్జాతీయ గుర్తింపు కూడా వ‌చ్చింది.

ఓ ప్ర‌ముఖ అమెరిక‌న్ వ్యాఖ్యాత  ఆ వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో, ఈ వీడియోపై ప్ర‌ముఖ అమెరిక‌న్ మీడియా న్యూయార్స్ టైమ్స్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. దీంతో, ఆ వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.

కికి చాలెంజ్ ప్ర‌మాద‌కరం....వ‌ద్ద‌ని పోలీసులు  వారించ‌డంతో ముగ్గురు తెలంగాణ యువ‌కుల‌కు ఓ వినూత్న ఐడియా వ‌చ్చింది. ప్ర‌మాద‌ర‌హితంగా, వినూత్న త‌ర‌హాలో కికి చాలెంజ్ ను చేయాల‌ని వారికి ఆలోచ‌న వ‌చ్చింది. కికీకి...ప‌ల్లె ప‌రిమ‌ణాలు అద్ది స్ఫూర్తివంతంగా మ‌ల‌చాల‌ని....ఇద్ద‌రు యువ రైతులు, ఓ యువ ద‌ర్శ‌కుడు అనుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా కికీ....హిప్ హాప్ సాంగ్ కు ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని జోడించారు.

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా మాన్యాలి మండలం లంబాడిప‌ల్లికి చెందిన అనిల్ కుమార్, పిల్లి తిరుప‌తి...శ్రీ‌కాంత్...లు `కికి చాలెంజ్ విలేజ్ ఫార్మ‌ర్స్ స్ట‌యిల్ ఇండియా `ను రూపొందించారు. అనిల్ , తిరుప‌తిలు మాగాణిలో జోడెద్దుల‌తో పొలం దున్నుతూ కికీ చాలెంజ్ కు స్టెప్పులేశారు.

జోడెద్దులు ముందుకు సాగిపోతుండ‌గా కాసేపు వాటి క‌ళ్లేల‌ని, నాగ‌ళ్ల‌ను వదిలేసి...`కికి డు యు ల‌వ్ మీ` పాట‌కు డ్యాన్స్ చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాటిని అందుకొని చాలెంజ్ ను పూర్తి చేశారు. ఆ వీడియోను అనిల్, తిరుప‌తిల మిత్రుడు షార్ట్ ఫిల్మ్ ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ త‌న యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. దీంతో, అది వైర‌ల్ అయింది.

వినూత్న త‌ర‌హాలో వీరు చేసిన కికి విలేజ్ వీడియో....దేశ‌వ్యాప్తంగా మీడియా, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ నోట ఈ నోట ప‌డి ...ఈ వీడియో అమెరికాలోని ఓ ప్ర‌ముఖ టీవీ షో హోస్ట్ కంటికి చిక్కింది. అమెరికాలోని కామెడీ సెంట్ర‌ల్ చానెల్ లో పాపుల‌ర్ అయిన `ది డైలీ షో` వ్యాఖ్యాత  ట్రెవ‌ర్ నోహ్ ....ఆ వీడియోకు ఫిదా అయ్యాడు.

ఆ వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఆ పాపుల‌ర్ హోస్ట్ పోస్ట్ చేశాడు. అంతేకాదు, `వారు కికి చాలెంజ్ ను గెలుచుకున్నారు` అంటూ కామెంట్ చేశాడు. దీంతో, తెలంగాణ కికి వీడియోకు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా `తెలుగోడి` కికీ చాలెంజ్ ను ఇప్ప‌టికే కోట్లాది మంది వీక్షించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు