మోడీ ర‌హ‌స్య మిత్రుడు జ‌గ‌న్‌.. ఆధారం ఇదిగో!

మోడీ ర‌హ‌స్య మిత్రుడు జ‌గ‌న్‌.. ఆధారం ఇదిగో!

అస‌లైన నాయ‌కుడు అంటే ఎలా ఉండాలి?  ప్ర‌జ‌ల ఆశ‌ల్ని.. ఆకాంక్ష‌ల్ని కాపాడేందుకు ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లు ఉండాలి. కోట్లాది మంది ప్ర‌యోజ‌నాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. ఈ సంద‌ర్భంలో ఎవ‌రితోనైనా గొడ‌వ‌కు సైతం సై అన్న‌ట్లు ఉండాలి. కానీ.. ఖ‌ర్మేందంటే.. ఏపీ రాజ‌కీయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఏపీ విప‌క్ష నేత‌కు అధికారం కావాలే త‌ప్పించి ఏపీ ప్ర‌యోజ‌నాలు అస్స‌లు అక్క‌ర్లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు.

హోదా విష‌యంలో ఇచ్చిన మాట‌ను త‌ప్పిన మోడీతో దోస్తీకి క‌టీఫ్ చెప్ప‌టమే కాదు.. హోదా పోరుకు ఏపీ స‌ర్కారు చేస్తుంటే.. మ‌రోవైపు అందుకు భిన్నంగా మోడీతో దోస్తానా చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ తీరు చూస్తే.. విస్మ‌యం క‌లుగ‌క మాన‌దు.bమోడీకి షాకిచ్చేందుకు.. అధికారం చేతిలో ఉంది కాబ‌ట్టి త‌మ‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి కుద‌ర‌ద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల్సింది పోయి.. తెర‌చాటు ఒప్పందాల‌తో.. సీక్రెట్ గా దోస్తానా చేస్తున్న వైనంపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్లో విప‌క్ష అభ్య‌ర్థికి అనుకూలంగా ఓటు వేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. చివ‌రి క్ష‌ణాల్లో అనూహ్య నిర్ణ‌యం అంటూ ఓటింగ్ నుంచి త‌ప్పుకోవ‌టం చూస్తే.. మోడీతో జ‌గ‌న్ కున్న ర‌హ‌స్య ఒప్పందం ఏ పాటిద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉండ‌టంతో మేజిక్ సంఖ్య త‌గ్గ‌టంతో పాటు.. ఎన్డీయే అభ్య‌ర్థి సులువుగా గెల‌వ‌టానికి సాయం చేసిన‌ట్లైంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మోడీ.. జ‌గ‌న్ దోస్తీకి తాజా ప‌రిణామం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. ఏమైనా.. అనూహ్య నిర్ణ‌యం పేరిట జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఆయ‌నకు భారీ డ్యామేజ్ ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసిన మోడీకి భుజానికి ఎత్తుకోవ‌టం జ‌గ‌న్ కు మాత్ర‌మే సాధ్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English