చార్జిషీటులో వైఎస్ భార‌తి.. ఎందుకంటే?

చార్జిషీటులో వైఎస్  భార‌తి.. ఎందుకంటే?

అవినీతి.. అక్ర‌మాల‌న్నంత‌నే గుర్తుకొచ్చే పేర్ల‌లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందుటారు. ఇప్ప‌టికే ప‌లు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయ‌న‌.. ప్ర‌తి వారం కోర్టుకు హాజ‌రు కావ‌టం తెలిసిందే. తాజాగా ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై ఛార్జిషీట్ న‌మోదైంది. భార‌తి సిమెంట్స్ పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఈడీ మూడు ఛార్జిషీట్లు దాఖ‌లు చేసింది. ఇందులో వైఎస్ భార‌తి పేరును న‌మోదు చేశారు.ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌న్ పై ఎన్ని కేసులు న‌మోదైనా.. భార‌తి పేరు న‌మోదు కాలేదు. తాజాగా ఈడీ సీబీఐ కోర్టులో మూడు ఛార్జిషీట్ల‌లో ఆమె పేరును న‌మోదు చేసింది.

వాస్త‌వానికి భార‌తీ సిమెంట్స్ పెట్టుబ‌డుల విష‌యంలో క్విడ్ ప్రో కో ప‌ద్ధ‌తిలో జ‌రిగిన వైనంపై భార‌తి పేరును న‌మోదు చేస్తార‌న్న వాద‌న జ‌రిగినా.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. తాజాగా మాత్రం భార‌తిపై ఛార్జిషీట్ల‌ను న‌మోదు చేశారు. ఒక‌వేళ ఈడీ కానీ స‌మ‌న్లు జారీ చేస్తే.. భార‌తి వ్య‌క్తిగ‌తంగా కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. జ‌గ‌న్ కంపెనీల్లోకి అక్ర‌మ పెట్టుబ‌డుల‌కు సంబంధించి మ‌నీలాండ‌రింగ్ చ‌ట్టం కింద ఈడీ త‌న ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. ఈడీ త‌న‌ఛార్జిషీట్లో భార‌తితో పాటు.. జ‌గ‌న్‌.. విజ‌య‌సాయిరెడ్డితో స‌హా ప‌లువురి పేర్ల‌ను ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

క‌డ‌ప జిల్లా ఎర్ర‌గుంట్ల‌.. క‌మ‌లాపురం మండ‌లాల మ‌ధ్య దాదాపు 1400 ల‌క్ష‌ల ట‌న్నుల నాణ్య‌మైన సున్న‌పురాయి నిల్వ‌ల‌తో పాటు పుష్క‌లంగా భూగ‌ర్భ జ‌లాలు ఉన్నాయి. ముంబ‌యి-చెన్నై రైల్వే లైన్ ఉంది. ఈ ప్రాంతంలో సి. రామ‌చంద్ర‌య్య ఏర్పాటు చేసిన ర‌ఘురామ్ సిమెంట్స్ పై దృష్టి సారించిన జ‌గ‌న్‌.. ఆ కంపెనీని టేకోవ‌ర్ చేసి.. దాన్ని భార‌తి సిమెంట్స్ గా మార్చారు.

త‌ప్పుడు ప‌ద్ద‌తిలో 2037 ఎక‌రాల సున్న‌పురాయి గ‌నుల‌ను లీజుకు ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. ఈ కేటాయింపుల్ని చ‌ట్ట‌బ‌ద్ధమ‌ని భార‌తి సిమెంట్స్ చెబుతోంది. ఈ వ్య‌వ‌హారంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. భార‌తీ సిమెంట్స్ కు అవ‌స‌ర‌మైన రుణాన్ని ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ అధికారులు సీఎం నివాసానికి వెళ్లి జ‌గ‌న్ చేత సంత‌కాలు చేయించుకొని రూ.200 కోట్ల రుణాన్ని ఇవ్వ‌టం. ఇదంతా వైఎస్ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కాలంలో జ‌రిగింది. చేతిలో ఉన్న అధికారంతో వ్య‌వ‌స్థ‌ల్ని నిర్వీర్యం చేయ‌టం వైఎస్ ప్ర‌భుత్వం త‌ర్వాతేన‌న్న విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో బ‌లంగా వినిపించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English