బాబుని గెలిపించేది జగనే!

బాబుని గెలిపించేది జగనే!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం కైవసం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు చేస్తున్న తప్పిదాలు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మారనుంది. భారతీయ జనతా పార్టీని నమ్మి చంద్రబాబు నాయుడు మోసపోయారనే సానుభూతి ప్రజలలో వ్యక్తమవుతోంది.

నాలుగేళ్ల పాటు నమ్మించి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన రెడ్డి లోపాయికారిగా భారతీయ జనతా పార్టీతో చేసుకున్న ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

ఢిల్లీలో చీటికీమాటికీ వైఎస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని బిజేపీ అగ్రనాయకులను కలుస్తుడండం కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవమున్న చంద్రబాబు నాయుడినే ఇబ్బందులపాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ అనుభవరాహిత్యం, ఆర్దిక నేరారోపణలు ఉన్న జగన్‌ను మరింత ఇబ్బందులు పెడతారని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావిస్తున్నారు.

బిజేపి ఉచ్చులో పడిన జగన్ అధికారం కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సైతం తాకట్టు పెడతారేమోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు అయితేనే భారతీయ జనతా పార్టీతో పోరాడగలరనే అభిప్రాయం ఆంధ్రప్రదేేశ్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ, హోదాపై నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీలకు చంద్రబాబు నాయుడు దూరంగానే ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి మాత్రం అవకాశాలను బట్టి ఎవరితోనైనా వ్యవహరించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ కాపుల రిజర్వేషన్లపై వ్యాఖ్యనించిన తీరే ఆయన అనుభవరాహిత్యాని తెలియజేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ జగన్ చేసిన ప్రకటన ఆయన నిజాయితీని తెలియజేస్తోందని పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్న భవిష్యత్తులో ఆయన అధికారంలోకి వస్తే ప్రతీ కార్యక్రమం నిర్వహించలేమని, ఇది తాను నిజాయితీగా చెప్తున్న మాటే అంటూ అభివ్రుద్దిని తుంగలో తొక్కే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో జగన్మోహాన రెడ్డి కంటే చంద్రబాబు నాయుడే మేలని, మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English