ఈ సెల్ఫ్ గోల్స్ ఆప‌వా జ‌గ‌న్‌..?

ఈ సెల్ఫ్ గోల్స్ ఆప‌వా జ‌గ‌న్‌..?

మ‌డిష‌న్నాక త‌ప్పులు చేయ‌టం త‌ప్ప‌నిస‌రి. కాకుంటే.. తెలివైనోడు ఎవ‌డూ ఒక‌సారి చేసిన త‌ప్పును మ‌ళ్లీ చేయ‌రు. కానీ.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూ..సెల్ఫ్ గోల్స్ స్పెష‌లిస్టుగా మారుతున్నారు. తాజాగా అలాంటి నిర్ణ‌య‌మే తీసుకొని మ‌రోసారి ఆయ‌నో కామెడీగా మారారు.

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఎన్నిక జ‌రుగుతున్న‌సంగ‌తి తెలిసిందే. మోడీ బ్యాచ్ త‌ర‌ఫు అభ్య‌ర్థిగా జేడీయూ పార్టీకి చెందిన  హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ నిలిచారు. ఇక‌.. విపక్ష అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.హ‌రిప్ర‌సాద్ నిలిచారు.

బీజేపీని వ్య‌తిరేకిస్తున్న పార్టీల‌న్నీ విప‌క్ష అభ్య‌ర్థికి ఓటు వేసే దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. మోడీ దూకుడును క‌ట్ట‌డి చేయ‌టం మిగిలిన పార్టీల ఉద్దేశం అయితే.. ఏపీకి చెందిన పార్టీలు మాత్రం ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆంధ్రోళ్ల‌కు చేస్తున్న అన్యాయ‌మే ఎజెండా.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఎన్నిక‌ల‌కు కీల‌క‌మైన పోలింగ్ వేళ‌కు జ‌గ‌న్ పార్టీ అనూహ్య నిర్ణ‌యం పేరుతో త‌న మాట‌ను చెప్పి మోడీ వ‌ర్గానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా నిర్ణ‌యం తీసుకుంది. దీంతో.. ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తీరు మ‌రోసారి స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యేలా చేసింది. ఇచ్చిన మాట‌కు క‌ట్ట‌బ‌డి ఉంటామ‌ని.. మాట మీద నిల‌బ‌డే వంశం త‌మ‌దిగా త‌ర‌చూ చెప్పుకునే జ‌గ‌న్‌.. తొలుత విపక్ష అభ్య‌ర్థికి తాము ఓటు వేస్తామ‌ని చెప్పి.. ఇప్పుడు తాము ఎవ‌రికి ఓటు వేయ‌మ‌ని చెప్ప‌టంలో అర్థం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

విభ‌జ‌న నిర్ణ‌యంలో కాంగ్రెస్ చేసిన త‌ప్పును ఎవ‌రూ క్ష‌మించ‌లేరు. అదే స‌మ‌యంలో మోడీ చేస్తున్న ప‌నిని ఆంధ్రోళ్లు ఎప్ప‌టికీ క్ష‌మించ‌లేరు. ఇలాంటి వేళ‌.. హోదా విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌క‌టించిన నిర్ణ‌యం దృష్ట్యా..  ఆ పార్టీ విష‌యంలో కొంత సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ.. అందుకు భిన్నంగా జ‌గ‌న్ తాజాగా తీసుకున్న అనూహ్య నిర్ణ‌యం అంతిమంగా మోడీ ప‌రివారానికే ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. తాము బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లుగా జ‌గ‌న్ బ్యాచ్ చెబుతోంది. ఇవాల్టికి బాగానే ఉన్నా.. దూర‌దృష్టితో చూసిన‌ప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ఏపీకి న‌ష్ట‌మే త‌ప్పించి ఎలాంటి లాభం ఉండ‌ద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో ఎన్డీయే ఓట‌మి పాలైతే.. అందుకు కార‌ణంగా ఏపీకి చెందిన రెండు పార్టీలు కీల‌క‌భూమిక పోషించ‌టం అన్న‌ది అంద‌రికి అర్థ‌మ‌వుతుంది. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీస్తే.. త‌మ ప్ర‌యోజ‌నాలు భారీగా దెబ్బ తినే వీలుంద‌న్న సందేశాన్ని మోడీ బ్యాచ్ కు తెలిపే చ‌క్క‌టి అవ‌కాశాన్ని జ‌గ‌న్ చేజార్చుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేనా.. తాను మాట మీద నిల‌బ‌డ‌తాన‌ని గొప్ప‌గా చెప్పే అవ‌కాశం జ‌గ‌న్ కు ఇప్పుడు ఉండ‌దు. ఇటీవ‌ల కాలంలో తాను గ‌తంలో చెప్పిన మాట‌ల‌కు భిన్న‌మైన మాట‌లు చెబుతూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి అదే త‌ప్పును చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English