బీజేపీకి కొత్త అర్థాన్ని చెప్పిన లోకేశ్‌

బీజేపీకి కొత్త అర్థాన్ని చెప్పిన లోకేశ్‌

ప్ర‌జ‌లు ఓట్లు వేసే వ‌ర‌కూ ఒక మాట‌.. వేసిన త‌ర్వాత మ‌రో మాట‌. బీజేపీ నేత‌ల తీరు అచ్చం అదేలా ఉంద‌న్న‌ది తెలిసిందే. మాటిచ్చి త‌ప్ప‌టంలో స‌రికొత్త రికార్డులు సృష్టించ‌ట‌మే కాదు.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని దారుణంగా దెబ్బ తీస్తున్న బీజేపీ పేరు ఎత్తితేనే ఆంధ్రోళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

న‌మ్మి.. గెలిపించిన దానికి ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క ఆంధ్రోడి నోటి నుంచి ఇప్పుడు వినిపిస్తుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో విభ‌జ‌న హామీల్ని దారుణంగా దెబ్బ తీసిన మోడీ స‌ర్కారు తీరుపై ఏపీ అధికార ప‌క్షం ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెబుతుంటే.. మ‌రోవైపు ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్లుగా చెప్పుకునే ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ లు నోరు మూసేసుకొని ఉండ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

తాజాగా బీజేపీపై ఏపీ మంత్రి లోకేశ్ విసిరిన పంచ్ అదిరింది.  బీజేపీ త‌న పేరును భార‌తీయ జ‌న‌తాపార్టీ కాకుండా భార‌తీయ జ‌గ‌న్మోహ‌న్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీగా పేరు మార్చుకుంటే బాగుంటుందంటూ చుర‌క‌లు వేశారు. అవినీతి పుత్రుడు జ‌గ‌న్ అయితే ప్ర‌ధాని మోడీకి ద‌త్త పుత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అని వ్యాఖ్యానించారు.

ప్ర‌త్యేక హోదాపై అవిశ్వాసం పెడితే మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ యూట‌ర్న్ తీసుకోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌డ‌తాన‌ని చెప్పిన ప‌వ‌న్ ప‌త్తా లేకుండా పోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త్వ‌ర‌లో జ‌గ‌న్‌.. ప‌వ‌న్ ల‌ను ఏపీ ప్ర‌జ‌లు త‌రిమికొట్ట‌టం ఖాయ‌మ‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు