త‌న స‌మాధి ఎలా ఉండాలో చెప్పిన క‌రుణ‌?

త‌న స‌మాధి ఎలా ఉండాలో చెప్పిన క‌రుణ‌?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతిమ సంస్కారాలు జరిగాయి. కరుణానిధికి కుటుంబ సభ్యులు, అభిమానులు, డీఎంకే శ్రేణులు, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే, త‌న స‌మాధి ఎలా ఉండాలి?  స‌మాధి కేంద్రంగా ఏం సందేశం ఇవ్వాల‌నే విష‌యంలో క‌రుణానిధికి ముందే స్ప‌ష్ట‌త ఉందని అంటున్నారు. ఏకంగా త‌న కుటుంబ స‌భ్యుల‌తో కూడా ఈ విష‌యం చ‌ర్చించార‌ట‌. ఈ మేర‌కు క‌రుణ‌ స‌మాధిని, శ‌వ‌పేటిక‌ను ఆయ‌న ఆకాంక్ష‌ల‌కు త‌గిన‌ట్లుగా తీర్చిదిద్దారు.

దివంగ‌త నాయ‌కుడైన తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శవపేటికపై ఆయన కుటుంబసభ్యులు కొన్ని వాక్యాలను చెక్కించారు. శవపేటికపై తమిళంలో ``విశ్రాంతి లేకుండా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి`` అని రాసి ఉంది. కరుణానిధి ఓ సందర్భంతో తన కొడుకు స్టాలిన్ తో ``మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి లేకుండా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారు`` అని అనుకోవాలని చెప్పారు. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికపై స్టాలిన్‌ తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు.

కాగా, అంతిమ యాత్రకు ముందు రాజాజీ హాల్ వ‌ద్ద భారీగా వ‌చ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేయ‌డం పోలీసుల వ‌ల్ల కాలేదు. దీంతో అక్క‌డ లాఠీచార్జ్ జ‌రిగింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో ఇద్ద‌రు మృతిచెందారు. రాజాజీ హాల్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో జ‌నం పోటెత్తారు. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ 10 మందిని రాజీవ్ గాంధీ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. సుమారు 41 మంది గాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. రాజాజీ హాల్ వ‌ద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొన‌డంతో.. శాంతియుతంగా ఉండాల‌ని స్టాలిన్ ప్ర‌జ‌ల్ని కోరారు. మెరీనా బీచ్ వ‌ద్ద ఖ‌న‌నం కోసం కోర్టులో కేసు గెలిచామ‌ని స్టాలిన్ అన్నారు. రిజ‌ర్వేష‌న్ల కోసం క‌రుణా పోరాడార‌ని, ఆయ‌న పార్ధీవ‌దేహాం ఖ‌న‌నం కోసం కోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు