అవినీతికి ప్రజలే కారణమట

అవినీతికి ప్రజలే కారణమట

రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, వారు రాజకీయం చేస్తున్నారా? లేకుంటే ఇంకేదన్నా చేస్తున్నారా? అన్న అనుమానం కలుగుతున్నది. అవినీతి పరుల్ని ప్రజలే తయారు చేస్తున్నారని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

అవినీతి పుట్టిందే రాజకీయాల వలన. ఇది వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయినటువంటి రాయపాటి సాంబశివరావుగారికి తెలియనిది కాదు. ఓట్లు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని, డబ్బు తీసుకుని ఓటేస్తే అవినీతి నాయకులే తయారవుతారని రాయపాటి అనడం పూర్తిగా తప్పు కాదుగాని, ఆయన అనడమే తప్పు. డబ్బుకి ప్రలోభ పడకుండా ఓట్లేయమని ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిది.

అధికారంలో ఉన్న పార్టీకే చెందిన రాయపాటి గడచిన కాలంలో అలాంటి చైతన్యం ఏమన్నా తీసుకొచ్చారా? దీనిపై ఆయన వివరణ ఇస్తే బావుంటుంది. అవినీతిని తయారు చేసి, ఆ అవినీతితోనే తమ జీవితాలు తెల్లారిపోయేలా ప్రజలెందుకు చేసుకుంటారో చెప్పండి రాయపాటిగారూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు