భూకంపాన్ని తట్టుకోలేవ్‌

భూకంపాన్ని తట్టుకోలేవ్‌

తెలంగాణ ఉద్యమం అంటే అంత చులకనా? అని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈటెల రాజేందర్‌, కె.తారకరామారావు తదితర ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌ని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ భూకంపాన్ని తట్టుకోవడం నీ వల్ల కాదని ముఖ్యమంత్రిని వారు హెచ్చరించారు. హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటే అంతకు అంతా అనుభవించాల్సి ఉంటుందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మీడియా ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కి సంకేతాలు పంపారు.

 మెదక్‌ జిల్లాలో పర్యటిస్తూ కేసీఆర్‌ భూకంపం వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఎద్దేవా చేయగా, ఆయన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ అగ్గిమీద గుగ్గిలమవుతున్నది. తమ సత్తా ఏంటో ముఖ్యమంత్రికి చూపించడానికి టిఆర్‌ఎస్‌ వ్యూహ రచన చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, వారిని రెచ్చగొట్టడానికి, తద్వారా తన సత్తా చాటుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారనీ అంటున్నారు. ఈ రాజకీయ పోరు ప్రజలను ఇబ్బందుల పాల్జేయకుండా ఉంటే అందరికీ మంచిది. అలా కాదని బంద్‌లు, ఆందోళనలు, విధ్వంసాలకు ఎవరు పాల్పడినా దాన్ని ఎవరూ సమర్థించరు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English