గుత్త జ్వాల భ‌గ్గు...ఎంపీ క‌విత ఏం చేయ‌లేక‌పోయారా?

గుత్త జ్వాల భ‌గ్గు...ఎంపీ క‌విత ఏం చేయ‌లేక‌పోయారా?

తెలంగాణ ప్రభుత్వం పెద్దలు ఇర‌కాటంలో ప‌డే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇటు ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న త‌న‌యుడు-మంత్రి కేటీఆర్, త‌నయ మ‌రియు నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత సైతం ఇరకాటంలో ప‌డే ప‌రిణామం ఇది. ఒక్క వ్య‌క్తి ఈ ముగ్గురిని అవాక్కయ్యేలా చేశారు. ఆ వ్య‌క్తి ఎవ‌రంటే...బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల! ఔను. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీకి స‌న్నిహితంగా వ్య‌హ‌రించిన గుత్తా జ్వాల అదే ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేదో అంత‌ర్గ‌త సంభాషణ‌ల్లో అనుకోకండి. బ‌హిరంగంగానే త‌న భావ‌న‌ను వ్య‌క్తం చేశారు జ్వాల‌.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే....గుత్తా జ్వాల గత కొద్ది సంవత్సరాలుగా బ్యాడ్మింటన్‌లోని రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ ప్రస్తుతం అకాడమీని స్ధాపించాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇందులో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసి సైతం విన్న‌వించారు. దీనికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున హామీ కూడా వ‌చ్చింది. అయితే, ఆ హామీ నెర‌వేర‌లేదు దీంతో జ్వాల ఆగ్రహాం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికి నెరవేరలేదని ట్విటర్ వేదికగా అసహనం తెలిపారు. నాలుగేళ్లు గడిచిన ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎంవో కార్యాలయానికి ట్వీట్ చేశారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద ఇంటి స్థలాన్ని ప్రకటించిందని, ప్రభుత్వమే హామీని ఇచ్చిందని గుత్తా జ్వాలా ఆవేదన వ్యక్తం చేశారు. త‌ను ఒక్క‌దానినే త‌ప్ప మిగ‌తా వారంద‌రికీ మేలు జ‌రిగింద‌ని వాపోయారు.

అయితే, గుత్తా జ్వాల ఎపిసోడ్‌లై పలువురి చూపు నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత వైపు ప‌డింది. టీఆర్ఎస్ సార‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు ఎంపీ క‌విత ప్ర‌భుత్వానికి, పార్టీకి ఎంపీ జ్వాల‌ను ద‌గ్గ‌ర చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, వారి కుటుంబాలకు చేయూతనివ్వాలని ఆమె పిలుపునిచ్చారు. దీంతో గుత్తాజ్వాల ముందుకు వ‌చ్చారు. గుత్తా జ్వాలతో పాటు సానియా మీర్జా తల్లి, ప్రజ్ఞాస్‌ ఓజాతో కలిసి టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య‌మైన‌ తెలంగాణ భవన్‌లో కవిత విలేకరులతో మాట్లాడారు. రైతు కుటుంబాలను ఆదుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గుత్తా జ్వాల, ఓజాలు ప్రకటించారు. గుత్తాజ్వాల లక్ష రూపాయలు, సానియా మీర్జా తరపున ఆమె తల్లి మూడు లక్షలు, ప్రజ్ఞాస్‌ ఓజా 2 లక్షల చెక్కులను అందించారు. వారిని ఎంపీ క‌విత అభినందించారు. అయితే, టీఆర్ఎస్‌ పార్టీకి, ప్ర‌భుత్వానికి మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించిన జ్వాల‌కు మాత్రం స్థ‌లం విష‌యంలో మిగిలింది నిరాశ మాత్ర‌మేన‌ని ప‌లువురు అంటున్నారు. అందులో భాగంగానే జ్వాల ఆగ్ర‌హ ట్వీట్ అని పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు