ఇదే రాహుల్ తెలంగాణ షెడ్యూల్‌..స్కెచ్చేంటంటే...

ఇదే రాహుల్ తెలంగాణ షెడ్యూల్‌..స్కెచ్చేంటంటే...

మిష‌న్ తెలంగాణ ప్రాజెక్టుతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌న్న‌ద్ధం చేసే వ్యూహ‌ర‌చ‌న మొద‌లుపెట్టిన‌ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త‌న స్కెచ్ అమ‌ల్లో పెట్టేందుకు ఆగ‌స్టు రెండో వారాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ‌లో పార్టీకి ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ట్టు పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో తాజాగా రాహుల్ తెలంగాణ రాష్ట్ర ప‌ర్యటన ఖరారైంది. 13, 14వ తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. నాలుగో విడ‌త‌ బస్సు యాత్రను రాజేంద్రనగర్ నుండి రాహుల్ ప్రారంభించనున్నారు. బ‌స్సు యాత్రే కాకుండా పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న వేగం పెంచారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు  వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌ పర్యటిస్తే పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని..పార్టీ నేతలు..కార్యకర్తలకు మరింత ఊపు వస్తుందని భావించిన  కాంగ్రెస్ నేతలు ఈ మేర‌కు త‌మ ఇలాకాలో ప‌ర్య‌టించాల‌ని పలుమార్లు రాహుల్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌తిపాద‌నకు ఒకింత ఆల‌స్యంగా ఓకే చేసిన రాహుల్ గాంధీ ఈ నెల 13వ తేదీన హైద‌రాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి రాజేంద్రనగర్ కు వెళుతారు. అక్కడ 2.30గంటలకు 10వేల మంది డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాంగ్రెస్ హాయాంలో ఉన్న పథకాలు..ప్రస్తుతమున్న పథకాలపై వారితో రాహుల్ చర్చించనున్నారు. సాయంత్రం 5గంటలకు శేరిలింగంపల్లిలో జరిగే బహిరంగసభ...రాత్రి 8కి నాంపల్లిలో జరిగే బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. రాత్రి 10గంటలకు ముస్లిం ప్రముఖలతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

మొద‌టి రోజు ముస్లింల‌తో స‌మావేశం కానున్న రాహుల్‌...ఆ మ‌రుస‌టి రోజు హిందువుల‌ను ఆక‌ట్టుకునే కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్నారు. 14వ తేదీ ఉదయం 9.30గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. అనంతరం 10గంటలకు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం 11గంటలకు వాణిజ్య ప్రముఖలతో భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీని రాహుల్ సందర్శించనున్నట్లు సమాచారం. ఈ మేర‌కు ఇప్ప‌టికే విద్యార్థి సంఘాల నాయ‌కులు ఓయూ వ‌ర్గాల‌ను ఆశ్ర‌యించి స‌భ ఏర్పాటుకు అనుమ‌తులు కోరాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English