భారతీయ మేధావికి నోబెల్‌తో సమానమైన పురస్కారం

భారతీయ మేధావికి నోబెల్‌తో సమానమైన పురస్కారం

భారత సంతతికి చెందిన మేధావికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఇండో ఆస్ట్రేలియన్‌ అక్షయ్‌ వెంకటేష్‌కు మేథ్‌మేటిక్స్‌లో ఫీల్డ్స్ మెడల్ వరించింది. 2018కి గాను ఫీల్డ్స్‌ మెడల్‌ కు(నోబెల్‌ బహుమతుల్లో లెక్కల విభాగానికిచ్చే పురస్కారం) నలుగురిని ఎంపిక చేశారు. ఇందులో అక్షయ్‌ వెంకటేష్‌ ఒకరు. ఆయనతో పాటు కౌచల్‌బికర్‌(ఇరాన్‌), పీటర్‌ స్కోల్జే(జర్మనీ) అలెషియోఫిగాలే(ఇటలీ) ఉన్నారు. వెంకటేష్‌ గణిత శాస్త్రంలో అనేక అంశాలపై విస్తృత రచనలు చేశారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా సేవలందిస్తున్నారు.

మధ్యతరగతి తమిళ కుటుంబానికి చెందిన ఆయన తండ్రి వెంకటేష్‌ రెండవయేటే ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్ళి పోయారు. అక్కడే వెంకటేష్‌ విద్యాభ్యాసం జరిగింది. చిన్నప్పటి నుంచి మేథ్స్‌ ఒలింపియాడ్‌లో క్రమం తప్పకుండా వెంకటేష్‌ పాల్గొనేవారు. అంతర్జాతీయ స్థాయి మేథ్స్‌ పోటీలకు కూడా హాజరయ్యారు. 11వ ఏట ఒకటి, 12వ ఏట మరొకటి అంతర్జాతీయ మేథ్స్‌ మెడల్స్‌ అం దు కున్నారు. 13వ ఏట యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలి యా లో చేరారు. 1997లో తన 16వ ఏట మేథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 20వ సంవత్సరానికే మేథ్స్‌లో పీహెచ్‌ డీ పట్టా పొందారు. ఎంఐటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరారు.

మేథ్స్‌ కు సం బంధించి అంతర్జాతీయ పురస్కారాలైన సేలం ఫ్రైజ్‌ 2007లో, శాస్త్ర రామానుజన్‌ ఫ్రైజ్‌ను 2008లో, ఇన్పోసిస్‌ ఫ్రైజ్‌ను 2016లో, ఓస్ట్రోవ్‌స్కీ ఫ్రైజ్‌ను 2017లో అందుకు న్నారు. ఇప్పుడు అత్యున్నత ఫీల్డ్స్‌ మెడల్‌ ఆయన్ను వరించింది. ఆధునిక మేథ్‌మెటిక్స్‌లో నెంబర్‌ థీయరీ, ఆటోమార్ఫిక్స్‌ ఫారమ్స్‌, రిప్రజెంటేషన్‌ థియరీ, ఎర్గోడిక్‌ థియరీలలో నూతన ఆవిష్కరణలు చేశారు.  దీర్ఘకాలంగా అపరి ష్కృతం గా ఉన్న యూరీలిన్నిక్‌ విధానం లోని సమస్యల్ని పరిష్క రించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English