జ‌గ‌న్ లా ఎందుకు తిట్ట‌లేదో చెప్పిన ప‌వ‌న్‌!

జ‌గ‌న్ లా ఎందుకు తిట్ట‌లేదో చెప్పిన ప‌వ‌న్‌!

సెల్ఫ్ గోల్స్ చేసుకోవ‌టంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు జ‌గ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా. త‌న‌కొచ్చే కాస్త మైలేజీని.. చేజేతులారా చెడ‌గొట్టుకోవ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయాల్సిన వేదిక మీద‌.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసి.. డిఫెన్స్ లో ప‌డిన ఆయ‌న తీరు ఇప్పుడు కామెడీగా మారింది.

ఏపీ సీఎం కుర్చీలో కూర్చోవ‌టానికి తెగ తాప‌త్ర ప‌డే జ‌గ‌న్ లాంటి అధినేత‌.. త‌న‌కెంత అర్హ‌త ఉంద‌న్న విష‌యాన్ని క‌నీసం కూడా ఆలోచించ‌ర‌న్న అభిప్రాయం క‌లిగేలా ఆయ‌న తీరు ఉంద‌ని చెప్పాలి. ప‌వ‌న్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల‌ను.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాల‌పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్ లోని చౌక‌బారు కోణాన్ని చూపించింద‌న్న విమ‌ర్శ‌ను మూట‌గ‌ట్టుకున్నారు.

త‌న‌ను విమ‌ర్శించిన జ‌గ‌న్ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత‌కు భారీ డ్యామేజ్ చేస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ త‌న‌పై చేసిన వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ త‌న‌ను తిడుతుంటే భ‌రించాన‌ని.. తిరిగి తిట్ట‌లేక కాద‌న్నారు. తాను బ‌లంగా తిట్ట‌గ‌ల‌న‌ని.. కానీ.. ఆయ‌న్ను తిట్టే ముందు వారి కుటుంబ స‌భ్యులు.. ఆడ‌ప‌డుచులు త‌న‌కు గుర్తుకు వ‌స్తార‌ని.. అందుకే బాధ్య‌తారాహిత్యంతో మాట్లాడలేన‌ని చెప్పారు.

తాను కొన్ని వ‌దిలేసుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని.. రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేయ‌టం స‌రికాద‌ని భావించిన‌ట్లు చెప్పారు. మ‌రి.. ఈ విష‌యం జ‌న‌సేన స్టార్ట్ చేసిన ఇంత‌కాలానికి ప‌వ‌న్ కు గుర్తుకు రావ‌టం ఏమిటి?  రెండు ప‌డ‌వ‌ల మీద ఇంత‌కాలం ప్ర‌యాణించి.. ఎన్నిక‌ల‌కుఏడాదిన్న‌ర ముందు వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌వ‌న్ నోటి నుంచి ఇలాంటి మాట‌లు రావ‌టం ఆస‌క్తిక‌రం. ఎన్నిక‌ల త‌ర్వాత ఎంత కాలంగా రాజ‌కీయాల్ని కంటిన్యూ చేస్తార‌న్న సందేహాన్ని ఆయ‌న స‌న్నిహితులే వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. ప‌వ‌న్  చెప్పే నీతులు కాస్తంత కామెడీగానే ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు