అర్థ‌రాత్రి దాటాక హైద‌రాబాద్‌లో బార్లు!

అర్థ‌రాత్రి దాటాక హైద‌రాబాద్‌లో బార్లు!

మందుబాబుల‌కు సూప‌ర్ శుభ‌వార్త‌. అర్థ‌రాత్రి పన్నెండు గంట‌ల వ‌ర‌కూ తాగిన త‌ర్వాత కూడా మ‌రికాసేపు.. మ‌రో పెగ్గు లాగించాలంటే ఇప్ప‌టివ‌ర‌కూ ఇబ్బంది ఉండేది. ఇక‌పై ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కాకుంటే.. వీకెండ్స్ లో మాత్ర‌మే. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఆస‌క్తికర నిర్ణ‌యాన్ని తీసుకుంది.

మందుబాబులు హ్యాపీగా ఫీల‌య్యేలా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. బార్ల‌ల్లో అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత  కూడా గ‌డిపేందుకు వీలుగా బార్ల స‌మ‌యాన్ని పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కూ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే బార్లు తెరిచే సౌల‌భ్యం ఉంది. ఇప్పుడు దాన్ని ఒంటి గంట వ‌ర‌కూ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ పొడిగింపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మాత్ర‌మే కాదు.. జీహెచ్ ఎంసీకి 5 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న బార్ల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రూల్స్ ప్ర‌కారం ఉద‌యం 10 గంట‌ల నుంచి అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే బార్లు తెరిచే వీలుంది.  వీకెండ్స్ లో ఉన్న ర‌ద్దీ నేప‌థ్యంలో  అర్థ‌రాత్రి 12 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కూ తెరిచే వీలును  క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అధికారికంగానే ఒంటి గంట‌వ‌ర‌కూ ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ప్పుడు.. మ‌రో గంట చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వీలుంద‌న్న మాట వినిపిస్తోంది.

వీకెండ్ అంటే.. శుక్ర‌.. శ‌నివారం మాత్ర‌మే ఈ వెసులుబాటు ఉంద‌ని చెబుతున్నారు. ఆదివారం అర్థ‌రాత్రి దాటాక కూడా తాగేస్తే.. సోమ‌వారం ఉద‌య‌మే ఆఫీసుకు క‌ష్టం క‌దా?  సో.. మందుబాబుల‌కు సూట్ అయ్యేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాకుంటే.. అర్థ‌రాత్రి ఒంటి గంట త‌ర్వాత రోడ్ల మీద ప‌రిస్థితి ఏమిట‌న్న‌దే ప్ర‌శ్న? 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు