డీఎస్‌కు ఇంకో షాక్‌...త‌న‌యుడిపై లైంగిక‌వేధింపులు

డీఎస్‌కు ఇంకో షాక్‌...త‌న‌యుడిపై లైంగిక‌వేధింపులు

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి. శ్రీనివాస్ కేంద్రంగా ఒక్క‌సారిగా సాగిన క‌ల‌కలం...అనూహ్య రీతిలో స‌ద్దుమ‌ణిగిన సంగ‌తి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రాజ్యసభ సభ్యుడు డీఎస్‌పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప‌రిణామం ఎలాంటి ఫ‌లితం లేకుండా అస్ప‌ష్టంగా ముగిసింది. ఓ వైపు ఈ క‌ల‌క‌లం ఇలా ఉండ‌గానే డీఎస్ ఫ్యామిలీ ఇంకో దుర్వార్తతో తెర‌మీద‌కు వ‌చ్చింది.  కాంగ్రెస్‌ మాజీ నేత డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్‌ నర్సింగ్‌ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థులు హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. 11 మంది అమ్మాయిలు హోంమంత్రికి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
 

డీఎస్ కుటుంబ స‌భ్యుల నిర్వ‌హణ‌లో నిజామాబాద్‌ జిల్లా శాంకరీ నర్సింగ్‌ కళాశాల ఉంది. ఈ విద్యార్థులు త‌మ కాలేజీలో జ‌రుగుతున్న తతంగాల గురించి వాపోతూ మ‌హిళా సంఘాల‌ను ఆశ్ర‌యించారు.  ప్రిన్సిపాల్ లేని సమయంలో గదికి రావాలంటూ వేధిస్తున్నారని వారికి చెప్పుకున్నారు. దీంతో వారంతా హోంమంత్రితో భేటీ అయేందుకు హైద‌రాబాద్ వ‌చ్చారు.మ‌హిళా సంఘాల నాయ‌కులు, విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు డీజీపీతో ఫోన్లో మాట్లాడిన నాయిని పోలీస్‌ కమిషనర్‌తో విచారణ జరిపించాలని ఆదేశించారు. త‌ప్పు ఎవ‌రు చేసినా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆయ‌న తెలిపారు.

మ‌రోవైపు మ‌హిళా సంఘాల నాయ‌కులు ఘాటుగా స్పందించారు. విద్యార్థుల‌తో క‌లిసి స‌చివాల‌యానికి వ‌చ్చిన పీవోడబ్ల్యూ సంధ్య మీడియాతో మాట్లాడుతూ తక్షణం సంజయ్‌ను అరెస్టు చేయాలన్నారు. కాలేజీ పర్మిషన్ రద్దు చేయాలన్నారు. కాగా, ఇప్ప‌టికే రాజ‌కీయంగా పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోయిన డీఎస్ మ‌రియు ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులకు ఈ వివాదం మ‌రో మ‌చ్చ‌గా మిగులుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు