సాక్షి క్లిప్పింగుల్ని చూపిస్తూ జ‌గ‌న్ కు షాకులు

సాక్షి క్లిప్పింగుల్ని చూపిస్తూ జ‌గ‌న్ కు షాకులు

బుర‌ద జ‌ల్లే మాట‌లతో మ‌భ్య పెట్ట‌టం ఎంతో కాలం సాగ‌దు. ఆ విష‌యం జ‌గ‌న్ కు ఇప్ప‌టికైనా అర్థ‌మైందో లేదో?  కానీ.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్రం మ‌హా బాగా అర్థ‌మైపోయింది. తాను చెప్పే మాట‌ల్ని ఎల్లో మీడియా అదే ప‌నిగా వ‌క్రీకరిస్తుంద‌ని చెప్పుకునే జ‌గ‌న్ ప‌ప్పులు ఈసారి అస్స‌లు ఉడ‌క‌టం లేదు. తాను చేసిన త‌ప్పుల‌ను ఎల్లో మీడియా అంటూ బండ‌లేసే జ‌గ‌న్ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు.
కాపుల రిజ‌ర్వేష‌న్ల మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.  నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో త‌న మాట‌పై యూట‌ర్న్ తీసుకున్న ఆయ‌న‌.. కాపు రిజ‌ర్వేష‌న్ మీద ఎల్లో మీడియా అవాకులు చ‌వాకులు రాసింద‌ని.. త‌న‌పై బండలేసింద‌ని.. త‌న మాట‌ల్ని వ‌క్రీక‌రించిందంటూ నోటికి వ‌చ్చిన‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడ‌టం తెలిసిందే.

టెక్నాల‌జీ బాగా పెరిగిపోయిన రోజుల్లో మాట్లాడే మాట‌లు ఆచితూచి అన్న‌ట్లుగా ఉండ‌కుంటే ఎంత ఇబ్బందో జ‌గ‌న్ కు ఇప్పుడు బాగా అర్థ‌మ‌వుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్లు కేంద్ర ప‌రిధిలోనిది.. ఆ విష‌యంలో తానేమీ చేయ‌లేన‌ని కాపు సోద‌రుల‌కు విస్ప‌ష్టంగా చెబుతున్నానంటూ చేసిన వ్యాఖ్య‌ను.. య‌థాత‌ధంగా బాగా హైలెట్ చేస్తూ సాక్షి ప‌త్రిక‌లో అచ్చేసుకున్న వైనం తెలిసిందే.

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై పెరిగిన వ్య‌తిరేక‌త‌తో ఉలిక్కిప‌డిన జ‌గ‌న్‌.. ఎప్ప‌టిలానే త‌న‌ను తాను క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం మొదలెట్టారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు కుట్ర‌తో తాను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్లుగా చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేశారు. అయితే.. జ‌గ‌న్ మాట‌ల‌కు ప్ర‌తిగా.. సాక్షిలో ఆయ‌న చెప్పిన మాట‌ల క్లిప్పుల్ని సోష‌ల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తున్నారు. మొత్తానికి సాక్షితో జ‌గ‌న్ కు త‌గులుతున్న షాకులు అన్ని ఇన్ని కావ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు