సోష‌ల్ మీడియా దెబ్బ‌కు మ‌హేశ్ రియాక్ట్ కాక త‌ప్ప‌లేదా?

సోష‌ల్ మీడియా దెబ్బ‌కు మ‌హేశ్ రియాక్ట్ కాక త‌ప్ప‌లేదా?

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎంత‌న్న విష‌యం చూస్తే.. ప్ర‌ముఖుల‌పై దాని ప్ర‌భావం అమితంగా ఉంటోంది. గ‌తంలో వారిని ప్ర‌భావితం చేసే తీరుకు భిన్నంగా సోష‌ల్ మీడియా ప్ర‌ముఖుల చేత చాలానే ప‌నులు చేయిస్తోంది. ఎక్క‌డిదాకానో ఎందుకు.. ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో హ‌రిత‌హారం జోరుగా సాగుతున్న వేళ‌.. గ్రీన్ ఛాలెంజ్ ను విసిరిన వైనంపై ప్ర‌ముఖులు భారీగా స్పందిస్తున్నారు.

తాము మూడు మొక్క‌ల్ని నాటే ప్ర‌ముఖులు.. గ్రీన్ ఛాలెంజ్ ను మ‌రో ముగ్గురికి విసురుతారు. ఇలా ప్ర‌ముఖులు జోరుగా విసురుతున్న ఛాలెంజ్ లో భాగంగా మంత్రి కేటీఆర్ విసిరిన స‌వాల్‌కు స‌చిన్.. ల‌క్ష్మ‌ణ్ లు మొక్క‌లు నాటి త‌మ చాలెంజ్ ల‌ను పూర్తి చేశారు. అయితే.. కేటీఆర్ ఛాలెంజ్ విసిరిన ప్ర‌ముఖ న‌టుడు మ‌హేశ్ బాబు రియాక్ట్ కాలేదు.

వ్య‌క్తిగ‌తంగా బిజీగా ఉన్నారో ఏమో కానీ.. ఆయ‌న నుంచి స్పంద‌న లేదు. దీంతో.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై కామెంట్లు రావ‌టం మొద‌ల‌య్యాయి. మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ కు మిగిలిన ఇద్ద‌రు ప్ర‌ముఖులు రియాక్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో మ‌హేశ్ బాబు మాత్రం కామ్ గా ఉండ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉంటే.. అప్ప‌టివ‌ర‌కూ కామ్ గా ఉన్న మ‌హేశ్‌.. త‌న కుమార్తె సితార‌తో క‌లిసి మొక్క‌లు నాటిన ఫోటోల్ని ట్విట్ట‌ర్ లో షేర్చేశారు. ఆపై త‌న కుమార్తె సితార‌.. కొడుకు  గౌత‌మ్‌.. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లికి స‌వాల్ విసిరారు. మొత్తానికి మొక్క నాటే విష‌యంలో ఇంత లేట్ చేయ‌కుండా ఛాలెంజ్ విసిరిన వెంట‌నే.. నాటేస్తే ఈ చ‌ర్చ ర‌చ్చంతా ఉండేది కాదుగా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు