కెసిఆర్‌ పిలిచారు.. వెళ్తారా మరి?

కెసిఆర్‌ పిలిచారు.. వెళ్తారా మరి?

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ పిలిచారని, ఆయనతో భేటీ అయ్యింది వాస్తవమని అన్నారు ఎంపి మంద జగన్నాథం. ఎంపిలు రాజయ్య, వివేక్‌లతో కలిసి మంద జగన్నాథం, కెసిఆర్‌తో భేటీ అయ్యారు ఫామ్‌ హౌస్‌లో. దాంతో వారు టిఆర్‌ఎస్‌లోకి చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది.

టిఆర్‌ఎస్‌లో చేరనుండడంపై ఇంకా స్పష్టత ఇవ్వని మంద జగన్నాథం, కాంగ్రెసు పార్టీపై విమర్శల ధాటి పెంచారు కాబట్టి, టిఆర్‌ఎస్‌లో వారు చేయడం ఖాయమే కావచ్చును. అయితే అధిష్టానానికి డెడ్‌లైన్‌ పెట్టలేదని, మే 30 లోగా తెలంగాణ అనుకూల ప్రకటన చేయాలని తాను విన్నపం మాత్రమే అధిష్టానానికి చేయడం జరిగిందని మంద జగన్నాథం అనడం వింతగా ఉంది. ఇదివరకు కొందరు కాంగ్రెసు నేతలు టిఆర్‌ఎస్‌లో చేరినప్పటికి, ఎంపిలు టిఆర్‌ఎస్‌లో చేరలేదు.

మధుయాష్కీ గౌడ్‌ వంటివారు టిఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉన్నా, వారిప్పుడు టిఆర్‌ఎస్‌కి దూరంగా జరిగారు. కేశవరావు సహా ముగ్గురు ఎంపిలు ఇప్పుడు టిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. వారు ఆ పార్టీలో చేరడం ఎంత నిజమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English