‘అర్జున్ రెడ్డి’ని చూసి భయపడ్డారట

‘అర్జున్ రెడ్డి’ని చూసి భయపడ్డారట

విజయ్ దేవరకొండ కెరీర్‌ను ‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అని విభజించి చెప్పొచ్చు. ఈ సినిమాతో అతను ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతడి ఇమేజే మారిపోయింది. అలాంటి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్‌ను డీల్ చేయడం అంత సులువు కాదు. ఈ విషయంలో ‘గీత గోవిందం’ టీం అంతా చాలా కంగారు పడిపోయిందట.

‘గీత గోవిందం’ సినిమా మొదలైన వారం రోజులకు ‘అర్జున్ రెడ్డి’ రిలీజై సెన్సేషనల్ హిట్టవడంతో తాము అయోమయంలో పడిపోయినట్లు నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించాడు. విజయ్ ఇమేజ్ మారిపోయిన నేపథ్యంలో ‘గీత గోవిందం’ సినిమాకు అతను సూటవుతాడా లేదా అన్న సంశయం కలిగిందని.. దీంతో టీం అంతా దీని మీద డిస్కషన్‌కు కూర్చున్నామిన అరవింద్ చెప్పాడు.

ఐతే మనం ఒక కథను.. పాత్రల్ని నమ్మి సినిమా చేస్తున్నామని.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి దానికి న్యాయం చేసే హీరో మన దగ్గర ఉన్నాడని.. అలాంటపుడు అతడి పాత్రను మార్చాల్సిన అవసరం ఏముందని తామందరం చర్చించుకుని.. విజయ్ పాత్రలో ఒక్క చిన్న మార్పు కూడా చేయొద్దని డిసైడయ్యామని అరవింద్ తెలిపాడు. ఈ విషయంలో చిత్ర బృందంతో కలిసి తాను కూడా క్రెడిట్ తీసుకుంటానని అరవింద్ అన్నాడు. మరోవైపు ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాట విషయంలోనూ ఒక దశలో తర్జన భర్జన నడిచినట్లు అరవింద్ వెల్లడించాడు.

ఈ పాటను సిద్ అమెరికా నుంచి పాడి పంపించాడని.. ఐతే అతను సరైన శ్రుతితో పాడలేదని సందేహించి.. వేరే గాయకుడితో ఇంకో వెర్షన్ పాడించామని చెప్పాడు. నిజానికి అదే పర్ఫెక్టుగా వచ్చిందని.. కానీ విజయ్ మాత్రం సిద్ పాడిన పాట వెరైటీగా ఉందని.. దాన్నే సినిమాలో పెడదామని చెప్పడంతో తాను ఒకే చేసినట్లు తెలిపాడు. ‘గీత గోవిందం’ అనే టైటిల్‌ను తాను వ్యతిరేకిస్తే పరశురామ్ వేరేవి సూచించాడని.. కానీ చివరికి ఈ టైటిలే బాగుందని చెప్పడంతో దీన్నే ఓకే చేశానని అరవింద్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు