శివాజీ సవాల్ కు స్పందించే సత్తా ఆ ఇద్దరు అధినేతలకుందా?

శివాజీ సవాల్ కు స్పందించే సత్తా ఆ ఇద్దరు అధినేతలకుందా?

నటుడు కాస్తా ఉద్యమ నేతగా మారటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. కమిట్ మెంట్ ఉంటే.. తాను పుట్టిన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే.. పట్టించుకోనట్లుగా వ్యవహరించే ప్రముఖులకు కొదవ లేదు. కానీ.. అందుకు భిన్నంగా విభజనతో జరిగిన నష్టంపై మొదట్నించి గళం విప్పుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమంటూ వాదనను వినిపిస్తూ.. ఆంధ్రోళ్లకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న ప్రముఖుల్లో శివాజీ పేరు ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే.

విభజన నాటి నుంచి ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై గళం విప్పిన ఆయన తాజాగా ఏపీ విపక్ష నేతలు జగన్.. పవన్ లను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హోదా కోసం పోరాడాలన్న ఆయన ధైర్యం ఉంటే రావాలని.. రాష్ట్రంలో బస్సులు ఆపటం కాదని రైల్వే ట్రాకుల మీద కూర్చుందామని.. కేంద్ర సంస్థల కార్యకలాపాల్ని ఆపుదామని సవాల్ విసిరారు.

మేధావుల మౌనం.. సమాజానికి శాపమన్న అంశంపై గుంటూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న శివాజీ.. ప్రజలను కులాల పేరుతో విభజించి..రాష్ట్రంలో అనుచిత వాతావరణాన్ని నెలకొల్పటానికి కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని తప్పు పట్టారు.

ఈ వ్యూహంలో భాగంగానే రామాయణంపై వ్యాఖ్యలు.. అమరావతిపై పుస్తకాలు.. రాజధానిలో దీక్షలు పుట్టుకొచ్చాయన్న శివాజీ.. ఏపీకి వచ్చిన కంపెనీలు ఎన్ని?  పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎన్ని అంటూ ప్రశ్నిస్తున్న విపక్ష నేతలకు ఆసక్తికర ప్రశ్నను సంధించారు. విదేశీ పర్యటనలతో ప్రధాని మోడీ దేశానికి తెచ్చిన కంపెనీలు ఎన్ని?  అని సూటిగా ప్రశ్నించిన శివాజీ.. ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తిరుపతిలో యూనిట్ పెట్టాలని యాపిల్ కంపెనీ ముందుకు వచ్చిందని.. కానీ.. వారి ప్రతినిధులు ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్లినప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చి మహారాష్ట్రకు తీసుకెళ్లటం వాస్తవం కాదా?  అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రోళ్లు తమ ఆక్రోశాన్ని చూపించనున్నారని.. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ సర్కారేనని తేల్చి చెప్పారు.  నయవంచనకు.. నమ్మక ద్రోహానికి కేరాఫ్ అడ్రస్ గా కేంద్రం మారిందన్నారు. శివాజీ సంధించిన సవాల్ కు..నిత్యం ఆవేశంతో ఊగిపోయే విపక్ష నేతలు.. ఏపీ కోసమే తానేదో చేస్తున్నట్లుగా చెప్పుకునే అధినేత రియాక్ట్ అవుతారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English