కేసీఆర్ లాంటి సీఎం చరిత్రలో ఇంకెవరూ లేరట.. కారణం తెలుసా?

కేసీఆర్ లాంటి సీఎం చరిత్రలో ఇంకెవరూ లేరట.. కారణం తెలుసా?

తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ముఖం చూసి 600 రోజులు దాటిపోయింది. ఈ టెర్ములో ఇక ఆయన సెక్రటేరియట్‌కు రాదలచుకోలేదని తెలుస్తోంది. సెంటిమెంట్ల కారణంగా ఆయన సచివాలయం దరిదాపుల్లోకి కూడా రావడం లేదని సమాచారం. ఇలా సెక్రటేరియట్‌కు రాకుండా పాలన సాగిస్తున్న సీఎం దేశంలో ఇంకెవరూ లేరని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సీఎం అయిన కొత్తల్లో ఆయన సచివాలయానికి వచ్చేవారు. కొన్నిసార్లయితే ఆదివారం కూడా సచివాలయం వచ్చారు. ఆదివారాల్లో సచివాలయంలో కేబినెట్ సమావేశాలు జరిపిన దాఖలాలున్నాయి. తర్వాత తర్వాత రావడం తగ్గించారు. వారంలో ఒకసారి రెండుసార్లు మాత్రమే వచ్చేవారు.

అయితే... ప్రగతి భవన్ నిర్మాణం పూర్తయిన తరువాత సచివాలయంతో ఆయన బంధం తెగిపోయింది. 2016 నవంబరు 25న ప్రగతి భవన్ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశం చేశాక చివరిసారిగా నవంబరు 28న సచివాలయానికి ఆయన వచ్చారు. అక్కడ జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు కేసిఆర్. ఆ తరువాత మళ్లీ రాలేదు.

ప్రగతి భవన్ నిర్మాణానికి ముందు కొన్నాళ్లు అంతకుముందు కూడా సచివాలయానికి రాకుండా బేగంపేటలోని పాత క్యాంపు ఆఫీసులోనే అదికారిక సమీక్షలు, సమావేశాలు నడిపారు. ఆయన సచివాలయానికి రాకపోవడానికి వాస్తు భయాలే కారణమని టాక్.  నిజానికి వాస్తు దోషం ఉన్న కారణంగానే సచివాలయాన్ని కూలగొట్టి వేరేచోట కొత్తది కట్టాలని అనుకున్నారు.. దానికోసం కొద్దికాలం హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయ్యారు.

కాగా కేసిఆర్ సచివాలయానికి వచ్చిన రోజుల సంఖ్య కంటే గవర్నర్ వద్దకు వెళ్లిన రోజుల సంఖ్య ఎక్కువ అని బిజెపి నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఏకంగా సమాచార హక్కు చట్టం ద్వారా కేసిఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు? రాజ్ భవన్ కు ఎన్నిసార్లు వెళ్లారు అన్నదానిపై దరఖాస్తు కూడా చేశారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు