ప‌వ‌న్ వ‌రుస పంచ్ ల‌కు జ‌"గ‌న్" తుస్‌!

ప‌వ‌న్ వ‌రుస పంచ్ ల‌కు జ‌

అందుకే అనేది ఒక మాట అన‌టం.. ప‌ది మాట‌లు అనిపించుకోవటం ఎందుక‌ని! తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఎప్పుడూ ఎదురుకాని విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. త‌న కంటే స్థాయిలో పెద్ద వారిని పుసుక్కున ఒక మాట అనేయ‌టం ఈజీనే. కానీ.. ఆ స్థాయిలో ఉన్న వారు ప్ర‌తిదానికి రియాక్ట్ అయితే.. వ‌చ్చే ఇబ్బంది అంతా ఇంతా  కాదు.

ఇంత‌కాలం తాను అన‌ట‌మే కానీ.. అనిపించుకోవ‌టం పెద్ద‌గా ఎరుగ‌ని జ‌గ‌న్ కు.. ప‌వ‌న్ అండ్ కో ధాటికి బెంబేలెత్తిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు.  అసెంబ్లీ నుంచి జ‌గ‌న్ పారిపోయారంటూ ప‌వ‌న్ విసిరిన పంచ్ కు.. కాస్త ఆలోచ‌న ఉన్నా జ‌గ‌న్ తీరు మ‌రోలా ఉండేది.

తాను శ‌ప‌ధం చేసి అసెంబ్లీ నుంచి వ‌చ్చాన‌ని.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై.. స‌మ‌స్య‌ల కోసం పోరాడుతున్నాన‌ని.. రాజ‌కీయాల్లో అవ‌గాహ‌న లేని ప‌వ‌న్ కు అవ‌న్నీ అర్థం కావంటూ విమ‌ర్శించి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ.. ఉడుకుమోతుద‌నం ఎక్కువ‌గా ఉండే జ‌గ‌న్‌.. త‌న స‌హ‌జ‌శైలికి త‌గ్గ‌ట్లుగా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాల్ని విమ‌ర్శిస్తూ అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప‌వ‌న్ పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. ఎంత రాజ‌కీయాలు అధ‌మ స్థానంలో ఉన్నా.. మ‌రీ ఇంత‌లా దిగ‌జారిపోవ‌టం ఏమిటంటూ జ‌గ‌న్ కు అక్షింత‌లు వేసినోళ్లే. ఇక‌.. ప‌వ‌న్ సైన్య‌మైతే.. జ‌గ‌న్ మీద చెల‌రేగిపోయింది. ఎంత‌లా అంటే.. త‌న‌ను తిట్టే వారి విష‌యంలో త‌న అభిమానులు రియాక్ట్ అవుతుంటే.. చూసీ చూడ‌న‌ట్లుగా ఉండే ప‌వ‌న్ సైతం.. ఆల‌స్యం చేయ‌కుండా జ‌గ‌న్ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని విన్న‌వించుకోవాల్సి వ‌చ్చింది.

అదే స‌మ‌యంలో.. త‌న పార్టీకి చెందిన నేత‌ల చేత కూడా మీడియాతో మాట్లాడించేలా చేశారు ప‌వ‌న్‌.  వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేయ‌టానికి జ‌న‌సేన దూర‌మ‌న్న క్లారిటీ ఇవ్వ‌టం ద్వారా..జ‌గ‌న్ పై సోష‌ల్ మీడియాలో  జ‌రుగుతున్న ట్రోలింగ్ ను కాస్త నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

కార్ల‌ను మార్చిన‌ట్లుగా ప‌వ‌న్‌ పెళ్లాల్ని మారుస్తాడంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన జ‌గ‌న్‌.. ఆ త‌ర్వాత నుంచి ప‌వ‌న్ విసురుతున్న పంచ్ ల‌కు ఎందుకు పెద‌వి విప్ప‌టం లేద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ప‌వ‌న్ ను విమ‌ర్శించ‌టం ద్వారా లేనిపోని త‌ల‌నొప్పుల‌ని.. త‌మ టార్గెట్ చంద్ర‌బాబు మాత్ర‌మే త‌ప్పించి ప‌వ‌న్ ఎంత‌మాత్రం కాద‌ని.. అవ‌స‌రం.. అవ‌కాశాన్ని చూసి విరుచుకుప‌డాలంటూ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు జ‌గ‌న్ కు సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలిసిందే.

ప‌వ‌న్ పై జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల కార‌ణంగా జ‌న‌సేనాధినేత కంటే కూడా త‌మ‌కు జ‌రిగిన న‌ష్టం ఎక్కువ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ స‌న్నిహితులు ఆయ‌న‌కు ఓపిగ్గా వివ‌రించిన‌ట్లు తెలిసిందే. దీనిపై జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.  సోష‌ల్ మీడియాతో పాటు.. మీడియాలో త‌న‌ను టార్గెట్ చేసేలా ప‌వ‌న్ అండ్ కో చేస్తున్న‌ప్ర‌య‌త్నాల కార‌ణంగా పాద‌యాత్రతో త‌న‌కొచ్చే మైలేజీ మిస్ అవుతుంద‌న్న సన్నిహితుల మాట‌లు ఆయ‌న‌పై ప్ర‌భావం చూపించిన‌ట్లుగా తెలుస్తోంది. ఉడికించినంత‌నే ఉడికిపోయే జ‌గ‌న్ లాంటి నేత‌.. ప‌వ‌న్ వేస్తున్న పంచ్ ల‌కు ఎంత కాలం జ‌'గ‌న్‌'  ఫైర్ కాకుండా ఉంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు