యూట్యూబ్‌లో చూస్తూ డెలివ‌రీ..త‌ల్లి ప్రాణం హ‌రీ

యూట్యూబ్‌లో చూస్తూ డెలివ‌రీ..త‌ల్లి ప్రాణం హ‌రీ

టెక్నాల‌జీ రెండు వైపులా ప‌దునున్న క‌త్తి వంటిది. ఎంత జాగ్ర‌త్త‌గా వాడుకుంటే..అంత మంచిది. కానీ అలా వాడుకోక‌పోవ‌డం వ‌ల్లే తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. యూట్యూబ్‌లో వీడియో చూస్తూ భార్యకు డెలివరీ చేశాడు ఓ భర్త. కార్తికేయన్.  ఆపరేషన్ వికటించడంతో భార్య మృతిచెందింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు శిశువు సురక్షితంగానే ఉంది. ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

తిరుపూర్‌కు చెందిన కార్తికేయ‌న్‌, కృతిక దంప‌తులు. కృతిక భర్త నైట్‌వేర్ ఏజెన్సీలో పనిచేస్తుండగా.. ఆమె ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరికే ఇప్పటికే మూడేళ్ల పాప ఉంది. రెండోసారి గర్భం దాల్చిన కృతికకు నెలలు నిండ‌టంతో ఇంట్లోనే డెలివరీ చేయాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. అయితే, దంపతులకు ఆధునిక వైద్య చికిత్సపై నమ్మకం లేకపోవడంతోనే ఇంట్లోనే ప్రథమ చికిత్సకు ప్రయత్నించారు. యూట్యూబ్‌లో 'How to help pregnant woman' videos అని టైప్ చేసి వాటిని వీక్షించారు. ఈనెల 22న కృతికకు పురిటి నొప్పులు రావడంతో యూట్యూబ్‌ వీడియోల్లో ఉన్న‌ విధంగా ఆమెకు కార్తికేయన్‌ దగ్గరుండి ప్రసవం చేశారు. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన కృతిక తీవ్ర అస్వస్థతకు గురైంది. డెలివరీ అనంతరం రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కృతిక ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతికి కారణమైన భర్తను పోలీసులు విచారిస్తున్నారు. ఇంట్లోనే డెలివ‌రీ చేయాల‌నే నిర్ణ‌యంతో ఆమె మృతిచెందినట్లు తిరుపూర్ రూరల్ పోలీసులు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు