మోడీకి సౌత్ షాక్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 150 కూడా క‌ష్ట‌మేన‌ట‌!

మోడీకి సౌత్ షాక్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 150 కూడా క‌ష్ట‌మేన‌ట‌!

ఒక‌రికి మేలు చేయాల‌న్న ఆలోచ‌న ఎప్పుడు మిస్ అవుతుందో.. అది ఊరికే పోదు. అందులోకి నోటి వ‌చ్చిన మాట‌ను నిల‌బెట్టుకోని నేతగా రాణించ‌రు. లక్ష‌లాది మంది స‌మ‌క్షంలో ఇచ్చిన మాట‌ను సైతం తూచ్ అంటూ తేలిగ్గా తీసేయ‌టం ఒక ఎత్తు అయితే.. తాను మాటను నిల‌బెట్టుకోలేని ప‌రిస్థితిని వివ‌రించి.. దానికి బ‌దులుగా మ‌రొక‌టి చేసినా ఎంతోకొంత అని స‌ర్ది చెప్పుకునే వీలుంది.

ఇందుకు భిన్నంగా అహంతో.. అధికార ద‌ర్పంతో వ్య‌వ‌హ‌రించ‌టం ఈ పార్టీ కైనా.. ప్ర‌భుత్వానికైనా ఇబ్బందే. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది మోడీ ప‌రివారం. ఇచ్చిన మాట‌ల్ని నిల‌బెట్టుకోక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. మోడీకి ద‌క్షిణాదిన వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఇది ఏకంగా ఆయ‌న్ను అధికారానికి దూరం చేసే ప్ర‌మాదం కూడా ఉంద‌ని చెబుతున్నారు.
రాజ‌కీయంగా చేసే త‌ప్పుల‌తో పాటు.. వ్యూహాత్మ‌కంగా దొర్లుతున్న త‌ప్పులు కూడా ఆయ‌న్ను భారీగా దెబ్బ తీయ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే..దాన్ని క‌వ‌ర్ చేయ‌టానికి ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మార‌ట‌మే కాదు.. అధికారానికి దూరం చేసే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

కేంద్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి మోడీ అండ్ కో చేస్తున్న క‌స‌ర‌త్తు అంతా ఇంతా కాదు. అయితే.. కొన్ని విష‌యాల్లో మోడీ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు వారికి  రాజ‌కీయంగా భారీ ఎత్తున న‌ష్టాన్ని వాటిల్లేలా చేస్తాయ‌ని చెబుతున్నారు.

2014లో సాధించిన సీట్లు మ‌ళ్లీ చేజిక్కించుకుంటామ‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు చెబుతుంటే.. అందుకు భిన్న‌మైన వాద‌న‌ను మ‌రికొంద‌రు క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌మ‌కు 150 సీట్లు సాధించ‌టం కూడా క‌ష్ట‌మేన‌న్న మాట‌ను బీజేపీ నేత‌లు చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీలో చంద్ర‌బాబుతో క‌టీఫ్ తో మొద‌లు కొని ద‌క్షిణాదిన ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తులు ఆ పార్టీకి మేలు కంటే కీడునే చేస్తున్నాయ‌న్న మాట వినిపిస్తోంది.

ఏపీకి హోదా విష‌యంలో హ్యాండ్ ఇవ్వ‌టం.. త‌మిళ‌నాడులో మితిమీరిన జోక్యం.. క‌ర్ణాట‌క‌లో ప‌వ‌ర్ కోసం ప‌డిన క‌క్కుర్తి.. ఇలా ద‌క్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో ఒక పంచాయితీ బీజేపీతో ముడేసి చెబుతార‌ని.. అదే వారికి శాపంగా మారింద‌ని చెబుత‌న్నారు. ఇప్పుడున్న అంచ‌నాల ప్ర‌కారం ద‌క్షిణాదిన ఒక్క సీటు గెలవ‌ట‌మూ క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు.

ఇక‌.. రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా దెబ్బ తీస్తుంద‌ని చెబుతున్నారు. ఇక‌.. యూపీలో ద‌ళిత‌.. మైనార్టీ వ్య‌తిరేక ఓటుతో పాటు.. బీఎస్పీ.. ఎస్పీ క‌లుయిక‌తో యూపీలోనూ పెద్ద ఎత్తున సీట్ల‌ను బీజేపీ కోల్పోనుంద‌ని చెబుతున్నారు. ఇవే కాక‌.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా ఆ పార్టీని తీవ్రంగా దెబ్బ ప‌డుతుంద‌ని చెబుతున్నారు.ఈ మాట‌ల్ని ఎవ‌రో విశ్లేష‌కుల నోట్లో నుంచి వ‌స్తే స‌ర్లే అనుకోవ‌చ్చు. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ ద‌గ్గ‌ర న‌డుస్తున్న చ‌ర్చ‌ల్లో ఈసారి బీజేపీకి భారీగా సీట్ల లాస్ గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది. క‌రుడుగ‌ట్టిన క‌మ‌లనాథులు మాత్రం వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 200 - 250 సీట్లు వ‌చ్చే వీలుంద‌న్న మాట వారి నోట వ‌స్తోంది. ఇలాంటివేళ‌.. మోడీకి వ‌చ్చే సీట్ల విష‌యంపై చ‌ర్చ జ‌రిగిన ప్ర‌తిసారీ.. క‌మ‌ల‌నాథుల ముఖాల్లో చెమ‌ట‌లు ప‌ట్ట‌టం స్ప‌ష్టంగా కనిపిస్తున్న ప‌రిస్థితి. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అన‌లేదు మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు