ప‌వ‌న్ ను కెలికి జ‌గ‌న్ భారీ త‌ప్పు చేశాడా?

ప‌వ‌న్ ను కెలికి జ‌గ‌న్ భారీ త‌ప్పు చేశాడా?

కార్ల‌ను మార్చిన‌ట్లుగా పెళ్లాల్ని మారుస్తాడంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.. తాజాగా పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో చ‌ర్చ‌గా మారాయి. గ‌డిచిన ఏడు నెల‌ల‌కు పైనే పాద‌యాత్ర పేరుతో జ‌గ‌న్ చేసిన శ్ర‌మంతా ప‌వ‌న్ కెలుకుడితో పూర్తి పోయింద‌న్న మాట వినిపిస్తోంది.
ఇప్ప‌టికే జ‌గ‌న్ లో మెచ్యురిటీ లేద‌ని.. ప్ర‌త్య‌ర్థుల్ని.. శ‌త్రువుల్ని ఒక‌త‌ర‌హాలో డీల్ చేస్తార‌ని.. ఆయ‌న‌లో ఆవేశం ఎక్క‌వ‌ని.. విచ‌క్ష‌ణ త‌క్కువ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తుంటాయి. దీనికి త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ నోరు పారేసుకోవ‌టంపై ప‌లువురు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఏపీలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బ‌లంగా ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును దెబ్బ తీయ‌టానికి వీలుగా ఉన్న దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా జ‌గ‌న్‌.. ప‌వ‌న్ ల మ‌ధ్య పొత్తు అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగింది. అయితే.. భిన్న‌ధ్రువాలుగా ఉండే ఈ ఇద్ద‌రు క‌ల‌వ‌టం అన్న‌ది ఉండ‌ద‌న్న మాట బ‌లంగా వినిపించింది.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్‌.. జ‌గ‌న్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం లేక‌పోవ‌టం.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్యాఖ్యాలు చేస్తున్న వైనంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. లోగుట్టుగా వీరిద్ద‌రి మ‌ధ్య మైత్రికి సంబంధించిన చ‌ర్చ‌లు ఏమైనా జ‌రుగుతున్నాయా? అన్న డౌట్లుప‌లువురి నోటి వెంట వినిపించాయి.

ఇదిలా ఉంటే.. ఇలాంటి అంచ‌నాలు త‌ప్ప‌ని చెప్ప‌టంతో పాటు.. ప‌వ‌న్ పై త‌న‌కున్న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన జ‌గ‌న్ దెబ్బ‌కు మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌వ‌న్ ను కెల‌క‌టం ద్వారా జ‌గ‌న్ భారీగా న‌స్టం వాటిల్లేలా చేసింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని తెర మీద‌కు తీసుకొచ్చి.. జ‌గన్ పెద్ద త‌ప్పు చేశారంటున్నారు.

ప‌వ‌న్ ను తిట్ట‌టం ద్వారా.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి ఆగ్ర‌హం తెప్పించ‌ట‌మే కాదు.. జ‌గ‌న్ పై త‌మ‌కున్న పాజిటివ్  కోణాన్ని ప‌క్క‌కు  పెట్టేసేలా చేసింద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ను న‌మ్మ‌కున్న మోడీ.. బాబును వ‌దులుకోవ‌టం కూడా వ్యూహాత్మ‌కంగా ఖ‌రీదైన త‌ప్పుగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ నుఎన్ని విమ‌ర్శ‌ల‌కు గురి చేసినా త‌ప్పు కాద‌ని..కానీ అందుకు భిన్నంగా వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల్ని ప్ర‌స్తావించ‌టం ఎంత వ‌ర‌కుస‌బ‌బు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడే జ‌గ‌న్ నోటి నుంచి ప‌వ‌న్ పై ఎందుకంత సీరియ‌స్ గా ఫైర్ అయ్యారో అర్థం కావ‌టం లేద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు