అంద‌రూ సెలెంట్ గా ఉండండి : చంద్రబాబు !

అంద‌రూ సెలెంట్ గా ఉండండి  : చంద్రబాబు !

ఏపీ రాజకీయాలు హఠాత్తుగా టర్న్ తీసుకున్నాయి. ఇంతకాలం టీడీపీని వైసీపీ, జనసేనలు విమర్శించడం.. వైసీపీ, జనసేనలను టీడీపీ విమర్శించడమే ఎక్కువగా కనిపించేది. కానీ.. తాజాగా వైసీపీ, జనసేల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేయడం.. ప్రతిగా పవన్ విమర్శలు చేయడంతో ఈ వివాదం ముదిరింది. ఆ రెండు పార్టీల మధ్య వివాదం ముదరడంతో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ... టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు ఒక సూచన చేశారు. వైసీసీ, జనసేన వ్యవహారంలో ఎవరూ తలదూర్చొద్దని.. దానిపై ఎవరూ స్పందించొద్దని చెప్పారట. ఒక్క మాటలో చెప్పాలంటే న్యూట్ర‌ల్‌గా ఉండాలని సూచించారట.

వైసీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఏపీలో నిర్వహించిన బంద్ ముగిసిన తర్వాత జగన్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తాడని అన్నారు. నాయకుడనేవాడు పది మందికీ ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో జగన్ చేసిన వ్యాఖ్యలను అనేకమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతేకాదు.. తప్పు ఎత్తి చూపడంతో పవన్ కూడా తట్టుకోలేక తిరిగి ఆరోపణలు చేశారు.  తాము కనుక నోరు విప్పితే జగన్ తట్టుకోలేడన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే..  తమకెంత ఉండాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అయితే... జగన్ వ్యాఖ్యల తరువాత కొందరు టీడీపీ నేతలు తమ పాత మిత్రుడు పవన్ కు సపోర్టుగా మాట్లాడారు. కానీ.. వెంటనే టీడీపీ అధిష్ఠానం నుంచి అందరికీ మెసేజ్ వెళ్లిందట. జగన్-పవన్ వివాదంలో తలదూర్చవద్దన్నది దాని సారాంశం. దీంతో ఇదే విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విజయవాడ నగర ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే వెనక్కి తగ్గారు. ఆయనొక్కరే కాదు... మరికొందరు నేతలు కూడా వెనక్కు తగ్గారు. దీనిపై స్పందించమని విలేకరులు అడిగినప్పుడు కొందరు నో కామెంట్ అంటున్నారే కానీ నోరు విప్పడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు