ఇష్టంతోనే శ్రీ‌రెడ్డి అవ‌న్నీ చేసింది క‌దా..?

ఇష్టంతోనే శ్రీ‌రెడ్డి అవ‌న్నీ చేసింది క‌దా..?

శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం కోలీవుడ్ లో ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. చెన్నై ఫ్లైట్ ఎక్కే ముందు.. హైద‌రాబాద్‌లోని త‌న మిత్రుల‌కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో స‌మాచారం అందించిన శ్రీ‌రెడ్డి.. తాను త్వ‌ర‌లో చెన్నై వెళుతున్నాన‌ని..అక్క‌డే కొన్నిరోజులు ఉంటాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ కంటే కోలీవుడ్ వాళ్లు చాలామంచోళ్లు అన్న ఆమె.. అక్క‌డికి వెళ్లిన నాటి నుంచి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కుచెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌పై షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు.

టాలీవుడ్ తో పోలిస్తే.. కోలీవుడ్ లో శ్రీ‌రెడ్డితో సంబంధం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ప్ర‌ముఖులు ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్. మురుగ‌దాస్‌.. సుంద‌ర్.సి. న‌టుడు శ్రీ‌రామ్ తో పాటు.. మ‌రికొంద‌రిపైనా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌ను వారంతా వాడుకున్నార‌ని ఆరోపించింది.

త‌న‌కు అవ‌కాశాలు ఇస్తాన‌ని చెప్పి.. ఇలా చేయ‌టం ఏమిటంటూ గుట్టు విప్పుతున్న ఆమె తీరుతో కోలీవుడ్ కు చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు.  ఒక‌రిద్దరు సినీ ప్ర‌ముఖులైతే ఏకంగా ఆమెపైన పోలీస్ కేసు  పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా న‌టుడు వారాహి ఆమెపై చెన్నై క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే శ్రీ‌రెడ్డి అంశంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది లేద‌ని.. శ్రీ‌రెడ్డి స‌మ్మ‌తంతోనే అన్ని జ‌రిగాయ‌న్న మాట‌ను ఆయ‌న మాట్లాడారు. అలాంటిది ఆమె వాటితో ప్ర‌చారం పొందాల‌నుకోవ‌టం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్నారు. శ్రీ‌రెడ్డి వారంద‌రినీ త‌ప్పు ప‌ట్ట‌టం స‌రికాద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు