వైసీపీ, టీడీపీ, సీపీఎం కలిసి పోటీ

వైసీపీ, టీడీపీ, సీపీఎం కలిసి పోటీ

వైసీపీ.. టీడీపీ.. సీపీఎం... ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తే? అస్సలు కుదరని కాంబినేషన్ అనుకోవద్దు. కానీ, ఈ కాంబినేషన్ వర్కవుట్ అయింది. అయితే.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాదు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ కాంబినేషన్ వర్కవుట్ అయింది. ఈ మూడు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు కలిసి పోటీ చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఆర్టీసీలో రాజ్యమేలుతున్న నేషనల్ మజ్దూర్ యూనియన్‌ను అడ్డుకోవడానికి ఈ మూడు పార్టీల కార్మిక సంఘాలు కలిశాయి.

రెండేళ్లకోసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గత 15 ఎన్నికల్లో 12 సార్లు ఎన్ఎంయూ గెలిచింది. మూడుసార్లు ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది.
ఈసారి ఎన్ఎంయూను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఈయూకు మిగతా పలు కార్మిక సంఘాలు మద్దతిస్తున్నాయి. అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్మిక పరిషత్, సీపీఎంకు చెందిన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, వైసీపీకి చెందిన వైసీపీ మజ్దూర్ యూనియన్‌ కూడా ఉన్నాయి. దీంతో ఈ మూడు పార్టీలకు చెందిన సంఘాలు కలిసి పోటీ చేస్తున్నట్లువుతోంది.

కాగా ఈ ఎన్నికలు ఆగస్టు 9న నిర్వహించనున్నారు. పొత్తుల ప్రకారం టీడీపీ, సీపీఎం, వైసీపీ సంఘాలకు పలు చోట్ల పోటీచేసే అవకాశం దక్కింది. మొత్తం 55 వేల కార్మికులున్న ఆర్టీసీలో ఎన్ఎంయూ, ఈయూ సంఘాల్లోనే 40 వేల మందికి పైగా సభ్యులుంటారు. ఆ తరువాత స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు 4 వేల మంది వరకు సభ్యులున్నాయి. మిగతా సంఘాల్లో తక్కువ మంది ఉంటారు. అయితే.. ఈ చిన్నచిన్న సంఘాలతో ఎవరు పొత్తు పెట్టుకోగలిస్తే వారికే విజయం దక్కుతుండడం ఆనవాయితీగా వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు