జ‌గ‌న్ ఫ‌స్ట్రేష‌న్ పీక్స్ కు వెళ్లిందా?

జ‌గ‌న్ ఫ‌స్ట్రేష‌న్ పీక్స్ కు వెళ్లిందా?

త‌నకున్న అవ‌కాశాల్ని త‌న‌కు తానుగా చెడ‌గొట్టుకునే నేత‌లు చాలా త‌క్కువ మందిలో ఉంటారు. అలాంటి వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందుంటార‌న్న మాట త‌ర‌చూ చెబుతుంటారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఈ మాట‌లో నిజం ఉంద‌నిపించ‌క మాన‌దు.

త‌న తండ్రి మ‌ర‌ణ‌వార్త విన్న గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. ఇంట్లో ఉన్న భౌతిక‌కాయం ద‌గ్గ‌ర కంటే కూడా.. లోప‌లి గ‌దిలో తన తండ్రి పేరిట ఉన్న సీఎం కుర్చీని త‌న సొంతం చేసుకోవ‌టానికి జ‌గ‌న్ క‌దిపిన పావుల ముచ్చట ఆయ‌న‌కు ఎంత డ్యామేజ్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

జ‌గ‌న్ సీఎం ఆశ గురించి తెలుసుకున్న నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఆమె కుమారుడు రాహుల్ సైతం ఆశ్చ‌ర్యానికి గురైన‌ట్లుగా చెబుతారు. అంతేకాదు.. త‌న‌ను ప్ర‌భావితం చేసేందుకు సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్నిచేప‌ట్టిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. జ‌గ‌న్ ను క‌ట్ట‌డి చేసేందుకు అప్ప‌టిక‌ప్పుడు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లుచేప‌ట్టి.. రోశయ్య‌ను సీఎంగా చేయ‌టం తెలిసిందే.

నిజానికి త‌న తండ్రి మ‌ర‌ణం స‌మ‌యంలో సంత‌కాల సేక‌ర‌ణ విష‌యంలో కాస్తంత సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి ఉన్నా.. ఆ త‌ర్వాతి కాలంలో సోనియాగాంధీ కోట‌రీకి స‌న్నిహితంగా ఉన్నా.. జ‌గ‌న్ కోరుకున్న సీఎం కుర్చీ ఈపాటికే వ‌చ్చి ఉండేది. కానీ.. ఆయ‌న త‌న మేలు కోరే వారి స‌ల‌హాల కంటే కూడా.. త‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా వ‌చ్చిన కోపాన్ని.. ఆవేశాన్ని.. అత్యాశ‌ను కంట్రోల్ చేయ‌టానికి ప్ర‌య‌త్నించ‌క ఎప్ప‌టిక‌ప్పుడు దెబ్బలు తింటూ ఉంటారు.

తాజాగా అలాంటి ప‌నే మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు జ‌గ‌న్‌. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు స్టార్ట్ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. వైఎస్ జ‌గ‌న్ మీద తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయ‌టం లేద‌ని చెప్పాలి.  ఆ మాట‌కు వ‌స్తే.. జ‌గ‌న్ ను ప్ర‌త్య‌ర్థిగా చూడ‌ని ప‌వ‌న్‌.. ఏ టైంలో ఎలాంటి అవ‌స‌రం ఉంటుందోన‌న్న ఆప్ష‌న్ తో ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ.. ఆ విష‌యాన్ని అర్థం చేసుకోవ‌టంలో బొక్క‌బోర్లా ప‌డిన జ‌గ‌న్‌.. ప‌వ‌న్ ను అన‌కూడ‌ని మాట‌లు అనేయ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

త‌మ‌కు తాజాగా ప్ర‌త్య‌ర్థిగా మారిన ప‌వ‌న్ మీద తాము సైతం ఇంత దారుణ వ్యాఖ్య‌లు చేయ‌మ‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. అంతేనా.. త‌మ అధినేత చంద్ర‌బాబు ఎప్పుడూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగొద్ద‌ని హెచ్చ‌రిస్తుంటార‌ని.. అలా చేస్తే ఆయ‌న చేతిలోక్లాస్ త‌ప్ప‌ద‌ని చెబుతారు. రాజ‌కీయంగా ఎంత పెద్ద ప్ర‌త్య‌ర్థి అయినా వ్య‌క్తిగ‌త అంశాల్లోకి వెళ్లొద్దు.. సంయ‌మ‌నాన్ని ఎక్క‌డా మిస్ కావొద్ద‌ని బాబు చెబుతార‌ని.. కానీ.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దారుణంగా ఉన్నాయ‌ని తెలుగు త‌మ్ముళ్లు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా వ్యాఖ్య‌లు చూస్తుంటే.. జ‌గ‌న్ ప్ర‌స్తుతం తీవ్ర‌మైన ఫ‌స్ట్రేష‌న్లో ఉన్న‌ట్లుగా అనుమానాలు రావ‌ట‌మే కాదు.. ఇలాంటి దూకుడు మ‌న‌స్త‌త్వం ఉన్న నేత చేతుల్లో రాష్ట్రాన్ని పెట్ట‌టం మంచిదేనా? అన్న ప్రాధ‌మిక సందేహం క‌లిగే ప‌రిస్థితి. పాద‌యాత్ర‌తో తెచ్చుకున్న మైలేజీని.. ప‌వ‌న్ మీద చేసిన ప‌ర్స‌న‌ల్ వ్యాఖ్య భారీ డ్యామేజ్ చేస్తుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు