రాహుల్‌కు బీజేపీ జుట్టు దొరికిందా?

రాహుల్‌కు బీజేపీ జుట్టు దొరికిందా?

2014 ఎన్నికలలో కేంద్రంలో అత్యధిక మెజారిటితో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది. గత నాలుగేళ్లుగా తమ పార్టీలో ఎటువంటి మచ్చ లేదని చెప్పుకుంటూ వచ్చారు, ఇదే ఆయుధాన్ని వచ్చే ఎన్నికలలో వాడుకోవచ్చని అనుకుంటున్న సమయంలో ఈ రాఫెల్ బాంబు పెలింది. గత శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీపై పెట్టిన అవిశ్వాస తీర్మాన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ రాఫెల్ విమానాల కొనుగోలు విషయాన్ని లేవనెత్తారు. రాఫెల్ యుద్ద విమానాల కొన్న ధరలను, భారతీయ జనతా పార్టీ బహిర్గతం చేయకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌. ఈ రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలులో భారీ స్దాయిలో ముడుపులు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.

గతంలో యూపీఏ ప్రభుత్వం భారత్‌కు ‍యుద్ద విమానాలు అమ్మేందుకు పలు కంపెనీలు పోటీ పడినప్పటికి ఫ్రాన్స్‌కు సంబంధించిన కంపెనీ ఒక విమానం 560 కోట్లు  కాగా, రాఫెల్ విమాన ధర 740 కోట్లుగా ఉంది.  తాము 20 శాతం రాయితిని కోరగా, అందుకు ఆ కంపెనీ ఒప్పుకుందని, అయితే అదేవిమానాలను బిజెపి ఒక్కోక్కటిని 1670 కోట్లకు కోనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే వాటి విలువను బహిర్గతం చేసేందుకు బిజెపి వెనుకాడుతోందని అన్నారు. ఈ ఆరోపణలకు భారత రక్షణ మంత్రి నిర్మలా సీతరామన్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని లేపాయి. యుద్దవిమానాల కొనుగోలులో ధరలు బహిర్గితం చేయకపోవడం ఫ్రాన్స్‌ దేశంతో ఒప్పందంలో భాగమని అన్నారు. ఈ ఒప్పందం 2008లోని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే జరిగిందని అన్నారు. అయితే దీనికి మాజీ రక్షణ మంత్రి ఎ.కె. అంటోని ఘాటుగా స్పందించారు. 2008లో రాఫెల్ యుద్దవిమానాల కొనుకోలు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు జరగలేదని అంటోని స్పష్టం చేశారు.

గ‌తంలో యుద్ధ విమానాల విభాగంలో ప‌నిచేసిన‌ తెలంగాణ‌ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీనిపై స్పందించారు. అసలు యుద్దవిమానాల కొనుగోలులో గోప్యతకు సంబంధించి ఎటువంటి ఆంక్ష‌లు లేవని ఆయన తెలిపారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి గతంలో యుద్దవిమానాలు నడిపిన అనుభవం ఉండడంతో ఆయన మాటలకు విశ్వాసనీయత పెరిగింది. రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బిజెపి ఇరుకున పెట్టి, ఇదే విష‌యాన్ని వచ్చే ఎన్నికలలో అస్త్రంగా మార్చలని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే నోరు జారిన నిర్మల సీతారామన్‌పై అధిష్టానం ఏ చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదైతేనేమి ఎన్నికల ముందు ఈ ఆరోపణ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద కుదుపే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు