బంద్‌లో జ‌గ‌న్ ట్విస్ట్ ... సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

బంద్‌లో జ‌గ‌న్ ట్విస్ట్ ... సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టం అమలుపై లోక్‌సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారని వైసీపీ నేతలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రజలు, పలు ప్రజాసంఘాలు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని.. విజయవంతానికి కృషిచేయాల‌ని ప్రత్యేక హోదాపై తమ ఆకాంక్షను మరోసారి బలంగా చాటాల‌ని కోరారు. అయితే ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి. కానీ జ‌గ‌న్ త‌న సొంత సంస్థ‌లో కార్య‌క‌లాపాలు మాత్రం ద‌ర్జాగా న‌డిపించుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

బంద్ సంద‌ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా సగానికి పైగా వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం త‌మ బంద్‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ నేత‌లు ఈ విధంగా ఆయా పార్టీ నేత‌లు స‌మ‌న్వ‌యం చేయ‌గ‌లిగారు.హోదా కావాలంటూ  తూర్పు గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఇలా కీల‌క ప‌రిణామాలో ఓ వైపు జ‌రుగుతుంటే..మ‌రోవైపు జ‌గ‌న్‌కు చెందిన భార‌తీ సిమెంట్ సంస్థ మాత్రం త‌న కార్య‌క‌లాపాలు యథావిధిగా నిర్వ‌హించుకుంంది.

ఈ మేర‌కు సంస్థ‌లో జ‌రుగుతున్న కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే రాష్ట్ర బందుకు పిలుపునిచ్చాన‌ని చెప్తున్న జగన్ త‌న సంస్థ‌కు ఎందుకు ఆ నియ‌మం వ‌ర్తింప‌చేయ‌డం లేద‌ని ప‌లువురు స‌హ‌జంగానే ప్ర‌శ్నిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతును కోరిన వ్య‌క్తి ఇలా చేయ‌డం ఏమిట‌ని సందేహిస్తున్నారు. ఇలా చేయ‌డం రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతుండ‌టం కాదా అని స‌హ‌జంగానే పేర్కొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల పాలు చేసి త‌న సంస్థ‌లో మాత్రం బంద్‌కు మద్దతు ప్రకటించకపోవడం దురదృష్టకరమని స్ప‌ష్టం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు