వైఎస్‌ జగన్‌దే ఆ రికార్డు

వైఎస్‌ జగన్‌దే ఆ రికార్డు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారు. కడప ఎంపిగా రికార్డు మెజార్టీతో గెలవడం కాదు. ఓ పార్టీ అధ్యక్షుడు.. మన రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు సంవత్సర కాలం జైల్లో ఉండడం ఇదే తొలిసారి.

జగన్‌ని అరెస్టు చేస్తే అతనికి సింపతీ లభిస్తుంది కాబట్టి, అతను అరెస్టయ్యే అవకాశం ఉండదని అనుకున్నారంతా. కాని, అది జరుగలేదు. జగన్‌ జైలుకు వెళ్ళారు. అక్రమంగా ఆస్తులు కూడగట్టారని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆర్థికంగా ఎదిగారని జగన్‌పై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలే ఆయన్ను జైలుకు పంపాయి. ఏ కోర్టుకు వెళ్ళినా జగన్‌కి బెయిల్‌ దొరకడంలేదు. ఇంకో నాలుగు నెలలు జగన్‌కి బెయిల్‌ వచ్చే అవకాశమూ కనిపించుటలేదు. జగన్‌ జైలులో ఉన్నా పార్టీ వెలుగు తగ్గకపోవడమే ఆశ్చర్యంగా ఉందిక్కడ. ఓదార్పు యాత్ర పేరుతో జనంలో జగన్‌ తిరగడం వల్లే అది సాధ్యం అయ్యిందని అనుకోవచ్చు.

2014 ఎన్నికల్లో జగన్‌ పోటీ చేయాలంటే ఈ కేసులనుంచి ఆయన బటపడాలి. అది సాధ్యమవుతఱుందో లేదో చెప్పడం కష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు